కియా సైరోస్ ఈవీ ఇంటీరియర్‌లో 30 అంగుళాల ట్రినిటీ పనోరమిక్ డిస్ప్లే ఉంటుంది. ఇందులో 12.3 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 5 అంగుళాల క్లైమేట్ కంట్రోల్ డిస్ప్లే కలిపి ఉంటాయి. ఇంకా కియా కనెక్ట్ 2.0తో 95కి పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్లు, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, హార్మన్ కార్డన్ ఎనిమిది స్పీకర్ ఆడియో సిస్టమ్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ముందు, వెనుక సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీట్, అంబియెంట్ లైటింగ్, వెనుక సన్‌షేడ్స్, అనేక యూఎస్బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్టులు, 16 లీటర్ల ఫ్రంట్ స్టోరేజ్ కంపార్ట్మెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. (image: Kia India)

