ప్రభన్యూస్

Jio Satellite Internet: భూమి నుంచి అంతరిక్షంలోకి జియో.. 1,600 శాటిలైట్లు, 23 గ్రౌండ్ స్టేషన్లు.. 6 లక్షల గ్రామాల్లో సిగ్నల్స్! | బిజినెస్


Last Updated:

భూమిపై మొబైల్, ఫైబర్ నెట్‌వర్క్ తర్వాత రిలయన్స్ జియో అంతరిక్షంపై గురిపెట్టింది. 1,600 శాటిలైట్లు, 23 గ్రౌండ్ స్టేషన్ల ఏర్పాటుతో దేశంలోని 6 లక్షలకు పైగా గ్రామాలకు పూర్తిస్థాయి కనెక్టివిటీ అందించే భారీ ప్రణాళికను ఐఎంసీలో ఆవిష్కరించింది.

News18
News18

టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో ఇప్పుడు భూమి నుంచి అంతరిక్షం వైపు అడుగులు వేస్తోంది. న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC 2026) పదో ఎడిషన్ వేదికగా జియో తన విప్లవాత్మక అంతరిక్ష ప్రణాళికను ప్రదర్శించింది. ‘స్కేల్ వితౌట్ బౌండరీస్’ థీమ్‌కు తగ్గట్టుగా సుమారు 1,600 లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈవో) శాటిలైట్లు, దేశవ్యాప్తంగా 23 గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేసే ప్రతిపాదనను వెల్లడించింది. సాంప్రదాయ టవర్లు, ఫైబర్ కేబుల్స్ వేయడం అసాధ్యమైన కొండలు, అడవులు, సరిహద్దు ప్రాంతాలకు సైతం అంతరిక్ష ఆధారిత నెట్‌వర్క్ ద్వారా హైస్పీడ్ కనెక్టివిటీ అందించడమే ఈ సరికొత్త ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో స్వదేశీ నియంత్రణ ఉండేలా ‘సావరిన్ శాటిలైట్ కనెక్టివిటీ’ పేరిట ఈ వ్యవస్థను జియో రూపొందిస్తోంది.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో శాటిలైట్ల రూపకల్పన, ఇంజినీరింగ్, ఇంటిగ్రేషన్, టెస్టింగ్, రాకెట్ లాంచ్, ఆపరేషన్స్ వరకు ప్రతీ దశపై భారతదేశంలోనే పూర్తి నియంత్రణ ఉండేలా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు. శాటిలైట్ నెట్‌వర్క్‌ను భూమిపై ఉన్న జియో ప్రధాన టెరెస్ట్రియల్ నెట్‌వర్క్‌తో అనుసంధానించడంలో దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసే 23 గ్రౌండ్ స్టేషన్లు కీలకంగా మారనున్నాయి. శాటిలైట్ ద్వారా నేరుగా మొబైల్ ఫోన్లకు డైరెక్ట్-టు-డివైస్ (డీ2డీ) కాలింగ్ సదుపాయాన్ని సైతం అందుబాటులోకి తెస్తున్నారు.

దేశవ్యాప్తంగా 6 లక్షలకు పైగా పల్లెలకు ఇంటర్నెట్ అందించడంతో పాటు భారత భూభాగం, సముద్ర తీరాలకు 100 శాతం నెట్‌వర్క్ కవరేజ్ కల్పించడం జియో ప్రధాన విజన్. మారుమూల గిరిజన పల్లెలు, ద్వీపాలు, సరిహద్దు పోస్టులతో పాటు విమానయానం, రక్షణ రంగం, సముద్ర రవాణా, ప్రభుత్వ సేవలు, విపత్తు నిర్వహణ విభాగాలకు ఇది కొండంత అండగా నిలవనుంది.

ప్రస్తుతం 1,600 శాటిలైట్లు, 23 గ్రౌండ్ స్టేషన్ల ప్రతిపాదనలు ప్రాథమిక దశలో ఉన్నప్పటికీ జియో లక్ష్యం మాత్రం సుస్పష్టంగా కనిపిస్తోంది. టవర్ల పరిమితులను అధిగమించి భూమి నెట్‌వర్క్‌ను నింగితో అనుసంధానం చేస్తూ కనెక్టివిటీని సరికొత్త శిఖరాలకు చేర్చేందుకు జియో సన్నాహాలు ముమ్మరం చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 October 2026, 7:22 pm Digital Edition : Prabhanews
Jio Satellite Internet: భూమి నుంచి అంతరిక్షంలోకి జియో.. 1,600 శాటిలైట్లు, 23 గ్రౌండ్ స్టేషన్లు.. 6 లక్షల గ్రామాల్లో సిగ్నల్స్! | బిజినెస్

Last Updated:Oct 08, 2026 7:10 PM ISTభూమిపై మొబైల్, ఫైబర్ నెట్‌వర్క్ తర్వాత రిలయన్స్ జియో అంతరిక్షంపై గురిపెట్టింది. 1,600 శాటిలైట్లు, 23 గ్రౌండ్ స్టేషన్ల ఏర్పాటుతో దేశంలోని 6 లక్షలకు పైగా గ్రామాలకు పూర్తిస్థాయి కనెక్టివిటీ అందించే భారీ ప్రణాళికను ఐఎంసీలో ఆవిష్కరించింది.News18టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో ఇప్పుడు భూమి నుంచి అంతరిక్షం వైపు అడుగులు వేస్తోంది. న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC 2026) పదో ఎడిషన్ వేదికగా జియో తన విప్లవాత్మక అంతరిక్ష ప్రణాళికను ప్రదర్శించింది. ‘స్కేల్ వితౌట్ బౌండరీస్’ థీమ్‌కు తగ్గట్టుగా సుమారు 1,600 లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈవో) శాటిలైట్లు, దేశవ్యాప్తంగా 23 గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేసే ప్రతిపాదనను వెల్లడించింది. సాంప్రదాయ టవర్లు, ఫైబర్ కేబుల్స్ వేయడం అసాధ్యమైన కొండలు, అడవులు, సరిహద్దు ప్రాంతాలకు సైతం అంతరిక్ష ఆధారిత నెట్‌వర్క్ ద్వారా హైస్పీడ్ కనెక్టివిటీ అందించడమే ఈ సరికొత్త ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో స్వదేశీ నియంత్రణ ఉండేలా ‘సావరిన్ శాటిలైట్ కనెక్టివిటీ’ పేరిట ఈ వ్యవస్థను జియో రూపొందిస్తోంది.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో శాటిలైట్ల రూపకల్పన, ఇంజినీరింగ్, ఇంటిగ్రేషన్, టెస్టింగ్, రాకెట్ లాంచ్, ఆపరేషన్స్ వరకు ప్రతీ దశపై భారతదేశంలోనే పూర్తి నియంత్రణ ఉండేలా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు. శాటిలైట్ నెట్‌వర్క్‌ను భూమిపై ఉన్న జియో ప్రధాన టెరెస్ట్రియల్ నెట్‌వర్క్‌తో అనుసంధానించడంలో దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసే 23 గ్రౌండ్ స్టేషన్లు కీలకంగా మారనున్నాయి. శాటిలైట్ ద్వారా నేరుగా మొబైల్ ఫోన్లకు డైరెక్ట్-టు-డివైస్ (డీ2డీ) కాలింగ్ సదుపాయాన్ని సైతం అందుబాటులోకి తెస్తున్నారు.దేశవ్యాప్తంగా 6 లక్షలకు పైగా పల్లెలకు ఇంటర్నెట్ అందించడంతో పాటు భారత భూభాగం, సముద్ర తీరాలకు 100 శాతం నెట్‌వర్క్ కవరేజ్ కల్పించడం జియో ప్రధాన విజన్. మారుమూల గిరిజన పల్లెలు, ద్వీపాలు, సరిహద్దు పోస్టులతో పాటు విమానయానం, రక్షణ రంగం, సముద్ర రవాణా, ప్రభుత్వ సేవలు, విపత్తు నిర్వహణ విభాగాలకు ఇది కొండంత అండగా నిలవనుంది.ప్రస్తుతం 1,600 శాటిలైట్లు, 23 గ్రౌండ్ స్టేషన్ల ప్రతిపాదనలు ప్రాథమిక దశలో ఉన్నప్పటికీ జియో లక్ష్యం మాత్రం సుస్పష్టంగా కనిపిస్తోంది. టవర్ల పరిమితులను అధిగమించి భూమి నెట్‌వర్క్‌ను నింగితో అనుసంధానం చేస్తూ కనెక్టివిటీని సరికొత్త శిఖరాలకు చేర్చేందుకు జియో సన్నాహాలు ముమ్మరం చేసింది.మరింత చదవండి

Source link