Last Updated:
Jio OTT Pass | జియో ఓటీటీ-పాస్ కొత్త 3 నెలల, 1 సంవత్సరం ప్లాన్‌లను ప్రకటించింది. రూ. 550, రూ. 2000 ప్లాన్‌లతో ఎక్కువ డేటా, ప్రీమియం ఓటీటీ యాప్‌లు లభిస్తాయి.
వినియోగదారుల్లో విశేష ప్రాచుర్యం పొందిన ‘జియో ఓటీటీ-పాస్’ (Jio OTT-Pass) పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ రిలయన్స్ జియో సరికొత్తగా 3 నెలల (త్రైమాసిక), 1 సంవత్సరం (వార్షిక) వ్యాలిడిటీ ప్లాన్లను ప్రకటించింది. వినియోగదారులకు మరింత ఎక్కువ డేటా, నిరంతరాయంగా ప్రీమియం వినోదాన్ని తక్కువ ఖర్చుతో అందించడమే లక్ష్యంగా ఈ కొత్త ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. వివిధ అవసరాలకు అనుగుణంగా ప్లాన్లను ప్రవేశపెట్టింది. మరి ఏ ప్లాన్‌కు ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయో తెలుసుకోండి.

