ప్రభన్యూస్

Jim Jim Tara Song: పర్ణశాల మూవీ నుంచి ‘జిమ్ జిమ్ తార’ పూర్తి పాట విడుదల.. సినిమాపై మ‌రింత హైప్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

వినూత్న ప్రచార వ్యూహాలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్న హారర్ కామెడీ చిత్రం ‘పర్ణశాల’ నుంచి ‘జిమ్ జిమ్ తార’ పాట పూర్తి వెర్షన్‌ను ఆదిత్య మ్యూజిక్ ద్వారా అధికారికంగా చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది.

News18
News18

వినూత్న ప్రచార వ్యూహాలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్న హారర్ కామెడీ చిత్రం ‘పర్ణశాల’ నుంచి ‘జిమ్ జిమ్ తార’ పాట పూర్తి వెర్షన్‌ను ఆదిత్య మ్యూజిక్ ద్వారా అధికారికంగా చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది. ‘పర్ణశాల’ మూవీ కోసం జి.ల‌క్ష్మిదేవి రాసి పాడిన ఈ పాట ఇప్పటికే ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా అధికారికంగా పూర్తి పాట విడుద‌ల త‌ర్వాత సినిమాపై మ‌రింత హైప్ పెరిగింది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వై.జి. భరత్ మాట్లాడుతూ.. “మా ప‌ర్ణ‌శాల సినిమా కోసం జి.ల‌క్ష్మిదేవి గారు రాసి పాడిన జిమ్ జిమ్ తార’ పాటకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన ఆనందాన్ని కలిగిస్తోంది. పూర్తి పాట విడుదల త‌ర్వాత అనూహ్య స్పంద‌న వ‌స్తోంది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటను అధికారికంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మరింత ఆనందంగా ఉంది. పూర్తి పాటకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుందని ఆశిస్తున్నాం” అని తెలిపారు.

పూర్తి పాట అధికారికంగా విడుదల కాకముందే, దీనికి సంబంధించిన బాణీ, వీడియోలు సోషల్ మీడియా వేదికలపై విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. పలువురు నెటిజన్లు ఈ పాటకు రీల్స్‌, వీడియోలు రూపొందిస్తుండగా, సెలబ్రిటీలు సైతం తమ కంటెంట్‌లో ఉపయోగించడం విశేషం.

ఎస్‌ఎల్‌టీ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత మంచి వెంకట్ నిర్మాణంలో వై.జి. భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. హారర్ కామెడీతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలను మేళవిస్తూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం, ఇప్పటికే తన వినూత్న ప్రచారంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ‘జిమ్ జిమ్ తార’ పాటకు లభిస్తున్న ఆదరణతో సినిమాపై ఇండ‌స్ట్రీలో అంచనాలు మరింత పెరిగాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 October 2026, 4:33 pm Digital Edition : Prabhanews
Jim Jim Tara Song: పర్ణశాల మూవీ నుంచి ‘జిమ్ జిమ్ తార’ పూర్తి పాట విడుదల.. సినిమాపై మ‌రింత హైప్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 13, 2026 4:33 PM ISTవినూత్న ప్రచార వ్యూహాలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్న హారర్ కామెడీ చిత్రం ‘పర్ణశాల’ నుంచి ‘జిమ్ జిమ్ తార’ పాట పూర్తి వెర్షన్‌ను ఆదిత్య మ్యూజిక్ ద్వారా అధికారికంగా చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది.
News18వినూత్న ప్రచార వ్యూహాలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్న హారర్ కామెడీ చిత్రం ‘పర్ణశాల’ నుంచి ‘జిమ్ జిమ్ తార’ పాట పూర్తి వెర్షన్‌ను ఆదిత్య మ్యూజిక్ ద్వారా అధికారికంగా చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది. ‘పర్ణశాల’ మూవీ కోసం జి.ల‌క్ష్మిదేవి రాసి పాడిన ఈ పాట ఇప్పటికే ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా అధికారికంగా పూర్తి పాట విడుద‌ల త‌ర్వాత సినిమాపై మ‌రింత హైప్ పెరిగింది.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వై.జి. భరత్ మాట్లాడుతూ.. “మా ప‌ర్ణ‌శాల సినిమా కోసం జి.ల‌క్ష్మిదేవి గారు రాసి పాడిన జిమ్ జిమ్ తార’ పాటకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన ఆనందాన్ని కలిగిస్తోంది. పూర్తి పాట విడుదల త‌ర్వాత అనూహ్య స్పంద‌న వ‌స్తోంది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటను అధికారికంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మరింత ఆనందంగా ఉంది. పూర్తి పాటకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుందని ఆశిస్తున్నాం” అని తెలిపారు.పూర్తి పాట అధికారికంగా విడుదల కాకముందే, దీనికి సంబంధించిన బాణీ, వీడియోలు సోషల్ మీడియా వేదికలపై విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. పలువురు నెటిజన్లు ఈ పాటకు రీల్స్‌, వీడియోలు రూపొందిస్తుండగా, సెలబ్రిటీలు సైతం తమ కంటెంట్‌లో ఉపయోగించడం విశేషం.ఎస్‌ఎల్‌టీ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత మంచి వెంకట్ నిర్మాణంలో వై.జి. భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. హారర్ కామెడీతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలను మేళవిస్తూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం, ఇప్పటికే తన వినూత్న ప్రచారంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ‘జిమ్ జిమ్ తార’ పాటకు లభిస్తున్న ఆదరణతో సినిమాపై ఇండ‌స్ట్రీలో అంచనాలు మరింత పెరిగాయి.మరింత చదవండి

Source link