పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. రజినీకాంత్ తనదైన స్టైల్‌తో సినిమాను ముందుకు నడిపించాడు. ఆయన నడక, చూపులు, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్‌తోనే చాలా సన్నివేశాలు పండిపోతాయి. పెద్దగా కష్టపడుతున్నట్టు కనిపించకుండానే తన ఆరాతో సినిమాను నిలబెట్టాడు. ఎస్.జే. సూర్య, సూరజ్ వెంజరమూడు తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. మిథున్ చక్రవర్తి, విద్యా బాలన్, యోగి బాబు కూడా మెప్పిస్తారు. రమ్యకృష్ణకు స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ, మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక కొన్ని సర్‌ప్రైజ్ గెస్ట్ అప్పియరెన్స్‌లు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

