తక్కువ ఆదాయం ఉన్నా ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల ప్రయోజనాలున్నాయి. చట్టపరంగా తప్పనిసరి కాకపోయినా ఐటీఆర్ దాఖలు చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. రుణం తీసుకునే సమయంలో ఇది ఆదాయానికి ఆధారంగా ఉపయోగపడుతుంది. హోమ్ లోన్, పర్సనల్ లోన్, వాహన రుణాల కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఐటీఆర్ ఉపయోగపడుతుంది. అలాగే వీసా పొందడానికి, ఎక్కువగా కట్ అయిన టీడీఎస్ రీఫండ్ పొందడానికి, భవిష్యత్ సంవత్సరాలకు కొన్ని నష్టాలను ముందుకు తీసుకెళ్లడానికి కూడా ఐటీఆర్ ఉపయోగపడుతుంది. అందువల్ల ఆదాయం తక్కువగా ఉందని మాత్రమే ఐటీఆర్ అవసరం లేదని భావించకూడదు. పెద్ద మొత్తంలో బ్యాంకింగ్ లావాదేవీలు, విదేశీ ఆస్తులు, ఎక్కువ ఖర్చులు వంటి పరిస్థితులు ఉంటే తప్పనిసరిగా ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)

