భారీ సామర్థ్యం: దీని ప్రొపల్షన్ వ్యవస్థ సామర్థ్యం 3,200 హెచ్‌పీ (HP). ఇది గంటకు 75 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శక్తివంతమైన హైడ్రోజన్ రైళ్లలో ఇది ఒకటిగా నిలవనుంది.
ప్రపంచ రికార్డు కోచులు: జర్మనీ, ఫ్రాన్స్, చైనా, జపాన్ వంటి దేశాల్లో 2 నుండి 4 కోచులతో మాత్రమే హైడ్రోజన్ రైళ్లను నడుపుతుండగా, భారతదేశం ఏకంగా 10 కోచులతో ఈ రైలును రూపొందించింది. ఇందులో ఒకేసారి 2,000 మంది ప్రయాణించవచ్చు.
ఈనాడు కథనం ప్రకారం.. ఈ రైలు పూర్తిగా శుద్ధ ఇంధన (Clean Energy) పరిజ్ఞానంతో పనిచేస్తుంది. ఇందులో ఎలాంటి దహనచర్య జరగకపోవడం వల్ల హానికరమైన పొగగానీ, కర్బన ఉద్గారాలుగానీ వెలువడవు. కేవలం నీటి ఆవిరి, వేడి మాత్రమే ఉప ఉత్పత్తులుగా వస్తాయి. అంతేకాకుండా, ఈ రైళ్లలో శబ్దం కూడా చాలా తక్కువగా ఉంటుంది.
భద్రత విషయంలో ఈ రైలుకు విమాన అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. హైడ్రోజన్ లీకేజీలు, వేడి, పొగ వంటి ముప్పులను ఇది క్షణాల్లో గుర్తించి అప్రమత్తం చేస్తుంది. ప్రమాద తీవ్రతను బట్టి ఆటోమేటిక్ షట్ఆఫ్ వ్యవస్థ ద్వారా హైడ్రోజన్ సరఫరాను నిలిపివేస్తుంది. లోకోపైలట్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్క్రీన్ ఆధారంగా రైలు స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు.
భారతదేశంలో తొలి హైడ్రోజన్ రైలు ఉత్తర రైల్వే పరిధిలోని జింద్ – సోనిపట్ సెక్షన్ మధ్య 89 కిలోమీటర్ల మేర నడవనుంది. ఈ మార్గంలో మొత్తం 12 స్టేషన్లలో రైలు ఆగనుంది. ఈ రైలు ఇంధనం కోసం జింద్‌లో ప్రత్యేకంగా హైడ్రోజన్ ప్లాంట్‌ను, డిస్పెన్సింగ్ కేంద్రాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఈ ప్రయోగం విజయవంతమయ్యాక, దేశంలోని ప్రముఖ సాంస్కృతిక వారసత్వ రైల్వే లైన్ అయిన కల్కా – శిమ్లా మార్గంలోనూ ఈ హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో విస్తృతంగా నడుస్తున్న విద్యుత్ రైళ్లు.. పైన ఉండే కరెంట్ తీగల నుంచి విద్యుత్‌ను తీసుకుంటాయి. దీనికి భిన్నంగా హైడ్రోజన్ రైలు సొంతంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటుంది. అంటే.. ఒకరకమైన స్టీమ్, డీజిల్ ఇంజిన్ల తరహాలో ఇది కూడా తన శక్తి వనరును స్వయంగా మోసుకెళ్తుంది.
సంప్రదాయ డీజిల్ రైలు ఇంజిన్లు ఇంధనాన్ని మండించి యాంత్రిక శక్తిని ఉత్పత్తి చేస్తాయి. హైడ్రోజన్ రైళ్లలో చిన్నపాటి పవర్‌ప్లాంట్ ఉంటుంది. దాన్ని ప్రోటాన్ ఎక్స్ఛేంజ్ మెంబ్రేన్ ఫ్యూయిల్ సెల్ అంటారు.
1,200 కిలోవాట్ల సామర్థ్యం ఉండే ఈ ఫ్యూయిల్ సెల్లో హైడ్రోజన్, ఆక్సిజన్ మధ్య రసాయన చర్య జరుగుతుంది. తద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. హైడ్రోజన్‌ను ట్యాంకుల రూపంలో రైలు మోసుకెళ్తుంది. ఆక్సిజన్‌ను పరిసరాల్లోని గాలి నుంచి సేకరిస్తుంది.
ఇలా ఉత్పత్తియిన విద్యుత్.. రైలులోని ట్రాక్షన్ మోటార్లకు శక్తిని అందిస్తుంది. అవి చక్రాలను నడుపుతాయి. దీని ప్రొపల్షన్ వ్యవస్థ సామర్థ్యం 3,200 హెచ్‌పీ. దీంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న శక్తివంతమైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా ఇది నిలిచింది. ఇది గంటకు 75 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది.
ఇది శుద్ధ ఇంధన పరిజ్ఞానం. ఈ ప్రక్రియలో నీటి ఆవిరి, వేడి మాత్రమే ఉప ఉత్పత్తులుగా వెలువడతాయి. ఇందులో దహనచర్య జరగదు. అందువల్ల హానికర పొగ, కర్బన ఉద్గారాలు వెలువడవు. ధ్వని కూడా తక్కువే.
ఈ రైల్లో విమాన అంచెల భద్రతా వ్యవస్థలు ఉన్నాయి. అవి హైడ్రోజన్ లీకేజీలు, వేడి, మంటలు, పొగ వంటి ముప్పులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతాయి. ఏదైనా సమస్య ఉత్పన్నమైతే క్షణాల్లోనే అప్రమత్తం చేస్తాయి.
రైల్లోని నాన్‌స్టాప్ వెంటిలేషన్ వ్యవస్థ.. గాలి ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేలా చూస్తుంది. ఇందువల్ల ఏదైనా లీకేజీ తలెత్తినా జరిగి గాలిలోకి వెళ్లి, పలుచబడిపోతుంది. ప్రమాదాన్ని గుర్తిస్తే.. ఆటోమేటిక్ షట్ఆఫ్ వ్యవస్థ తనంతట తాను హైడ్రోజన్ సరఫరాను నిలిపివేస్తుంది.
భద్రతకు ప్రాధాన్యమిస్తూ లోకోపైలట్ క్యాబిన్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. లోక్ పైలట్ ఎదుట ఉండే ఒక స్క్రీన్.. అన్ని అంశాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది.
హైడ్రోజన్ రైలును ఇప్పటికే విరివిగా పరీక్షలకు గురిచేశారు.
ఈ రైలు కోసం జింద్‌లోని హైడ్రోజన్ ప్లాంటుతో పాటు సింగ్, డిస్పెన్సింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ కూడా ఇదే తరహా భద్రతా ఏర్పాట్లు చేశారు.
హైడ్రోజన్ రైలు తొలుత ఉత్తర రైల్వే పరిధిలోని జింద్-సోనిపట్ సెక్షన్లో నడుస్తుంది. 89 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మధ్యలో 12 స్టేషన్లలో ఆగుతుంది. కల్కా-శిమ్లా వంటి సాంస్కృతిక వారసత్వ రైల్వే లైన్లలోనూ హైడ్రోజన్ పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా హైడ్రోజన్ రైళ్లు ఇంకా ఆరంభ దశలోనే ఉన్నాయి. తొలిసారిగా జర్మనీ దీన్ని ప్రవేశపెట్టింది. ఫ్రాన్స్, ఇటలీ, చైనా, జపాన్ వంటి దేశాలు ప్రయోగాత్మకంగా నడపడమో లేక పరిమితంగా వినియోగంలోకి తీసుకురావడమో చేస్తున్నాయి. అయితే ఆ రైళ్లలో 2-4 కోచులు మాత్రమే ఉంటున్నాయి. దీనికి భిన్నంగా భారతీయ హైడ్రోజన్ రైలులో 10 కోచులు ఉంటాయి. అందులో 2,000 మంది ప్రయాణించవచ్చు.
