Last Updated:
Hyderabad Richest Person: జీవితంలో ప్రభావశీల వ్యక్తులు అంటే సాధారణ జీవితం గడిపే స్థాయి నుంచి కొన్ని వేల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయికి ఎదిగిన వాళ్లను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలకు చెందిన అలాంటి ఓవ్యక్తి పేరు ఇప్పుడు ఫోర్బ్స్ జాబితాలో చేరింది.
Success Story: ఇప్పుడు ప్రపంచ కుభేరుల జాబితాలో తెలుగు వాళ్ల పేర్లు కూడా నమోదవుతున్నాయి. ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి చెందిన వ్యక్తి ఇప్పుడు వేలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాదు లక్షల కోట్ల ఆస్తి కలిగి అపరకుభేరుడిగా ఫోర్బ్స్ జాబితాలోకి ఎక్కాడు.
పదివేల రూపాయిల ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్‌తో గడుస్తున్న కుటుంబంలో అతనొకరు. కాని ఇప్పుడు లక్ష కోట్లకుపైగా ఆస్తి కలిగి హైదరాబాద్‌లో అత్యంత బిగ్‌షాట్‌గా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరూ..? ఆయన ఆస్తి వివరాలు..? ఆయన ఫ్లాష్ బ్యాక్ గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం. ఆయన పేరే దివీ మురళి. హైదరాబాద్రి చెందిన దివీస్ ల్యాబ్స్ అధినేత.
జీవితంలో ప్రభావశీల వ్యక్తులు అంటే సాధారణ జీవితం గడిపే స్థాయి నుంచి కొన్ని వేల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయికి ఎదిగిన వాళ్లను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలకు చెందిన అలాంటి ఓవ్యక్తి పేరు ఇప్పుడు ఫోర్బ్స్ జాబితాలో చేరింది. ఇప్పుడు శ్రీమంతుడిగా ఉన్న ఆయన గతం గురించి చెప్పుకుంటే పదివేల రూపాయిల ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్‌తో గడుస్తున్న కుటుంబానికి చెందిన వ్యక్తి అతను. మొత్తం ఫ్యామిలీలో 14 మంది. అందులో ఒక పిల్లవాడు. అతని ఆశయాలు చాలా గొప్పవి కానీ వాటిని సాధించే పరిస్థితులు మాత్రం అంతంతమాత్రమే. మచిలీపట్నంలో ఇంటర్ సెకెండియర్ రెండుసార్లు ఫెయిల్ అయినప్పటికి జీవితంలో ఎలా పాస్ అవ్వాలో సొంత లక్ష్యాన్ని నిర్దేశించుకున్న వ్యక్తిగా తనను తానే మార్చుకున్న శిల్పి. ఏదో సాధించాలన్న అతనిలోని తపన.. ఇప్పుడు ఈ బిజినెస్మెన్ తలరాతను మార్చేశాయి. ఆయన పేరే మురళి దివి. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన దివి మురళి ఎవరో కాదు దివీస్ ల్యాబ్స్ అధినేత. ఇంటర్ ఫెయిల్ అయిన తర్వాత మణిపాల్ హైయర్ స్టడీస్ కాలేజీలో చేరి బీఎస్సి పూర్తి చేశారు. అదే ఆయన జీవితాన్నిఅనుకోని మలుపు తిప్పిందని చెప్పాలి. ఇంటర్ రెండుసార్లు ఫెయిల్ అయిన అదే కుర్రాడు నేడు అపరకోటీశ్వరుడిగా నెలకొనడానికి పునాది వేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఓ చిన్న టౌన్‌కు చెందిన మురళీ దివి.. నేడు ఫోర్బ్స్ జాబితాలో హైదరాబాద్‌లోనే అత్యంత కోటీశ్వరుడిగా నిలిచారు. ఫోర్బ్స్ జాబితా తాజా నివేదిక ప్రకారం అక్షరాల లక్ష 30 వేల కోట్ల ఆస్తితో మురళీ దివి అపరకుభేరుడిగా భారతీయులు ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఓ తెలుగు వ్యక్తి ఈ అసాధారణ స్థాయికి చేరుకోవడానికి చేసిన కృషి ఒకరోజులో, ఒక ఏడాదిలో జరిగిన పరిణామం కాదు. నలభై ఏళ్ళ సుదీర్ఘ శ్రమతో ఏర్పడిన సామ్రజ్యం. అదే వేలాది మందికి అన్నం పెడుతున్న దివీస్ ల్యాబ్స్.
చిన్నప్పుడు పెద్దగా చదువు ఒంటబట్టని మురళీ.. ఒకానొక సందర్భంలో తన సోదరుడు మాదిరిగానే తను కూడా బీఎస్సీ చదవాలని నిశ్చయించి మణిపాల్ కాలేజీలు చేరారు. అప్పటికే పద్నాలుగు మంది సభ్యులున్న కుటుంబంలో తండ్రి ప్రభుత్వ ఉద్యోగ విరమణ తర్వాత వచ్చే పెన్షన్ డబ్బులు రూ.10 వేలతోనే వారి కుటుంబం గడవాలి. ఆ స్థాయి నుంచే ఆయన సక్సెస్ లైఫ్ జర్నీ మొదలైంది.
డిగ్రీ అయిన తర్వాత మురళి ఓ సంస్థలో ఫార్మసిస్ట్‌గా ఉద్యోగం చేశారు. అప్పుడు అతని జీతం నెలకు రూ. 250 రూపాయిలు. 1976లో మురళి తన 25వ ఏట అమెరికా వెళ్ళి ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో మురళి చేతిలో ఉన్న డబ్బు రూ. 500. తెలిసినవాళ్ళ సహాయ సహకారంతో మురళి అమెరికాకి వెళ్ళగలిగారు. అక్కడ ట్రినిటీ కెమికల్స్, ఫైక్ కెమికల్స్ వంటి సంస్థల్లో ఫార్మసిస్ట్‌గా జాబ్ చేశారు. అతి తక్కువ కాలంలోనే ఏటా 65 వేల డాలర్ల జీతం గడించే స్థాయికి చేరుకున్నారు. ఆ తర్వాత మురళి దివి పలు ఫార్మసిటికల్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ సైంటిస్ట్‌గా ఎదిగారు.
ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నట్లుగా విదేశాల్లో పేరు, డబ్బు సంపాదించుకున్న మురళి 1984 సంవత్సరంలో 40 వేల డాలర్లతో ఇండియాకు తిరిగి వచ్చారు. ఒక స్నేహితుడితో కలిసి కెమినార్ అనే సంస్థను స్థాపించారు. 1989లో కెమినార్ సంస్థను రెడ్డి ల్యాబ్స్ టేకోవర్ చేసింది. అక్కడి నుంచి మురళీ దివి రెడ్డి ల్యాబ్స్‌లో ఆరేళ్ళ పాటు పనిచేశారు. 1995లో మురళీ రెడ్డి ల్యాబ్స్ నుంచి బయటికి వచ్చి సొంతంగా దివీస్ ల్యాబ్స్ అనే సంస్థను నెలకొల్పారు. హైదరాబాద్ చౌటుప్పల్‌లో మొదటి ఫ్యాక్టరీని 1995లో స్థాపించారు. ఆ తర్వాత ఏడేళ్ళకి అంటే.. 2002 లో దివీస్ ల్యాబ్స్ రెండో ఫ్యాక్టరీని విశాఖపట్నం చిప్పాడలో స్థాపించారు. ఈ రెండు ఫార్మ కంపెనీలు, రా డ్రగ్ తయారి పరిశ్రమలు నెలకోల్పి ప్రత్యక్షంగా వేలాది మందికి.. పరోక్షంగా లక్షలాది మందికి జీవనోపాధి కల్పించారు.
ప్రపంచం ఫార్మసిటికల్ రంగానికి అవసరమైన క్రియాశీలక ఔషద పదార్ధాల ఉత్పాదన, సరఫరా చేసే ప్రముఖ సంస్థగా దివీస్ ల్యాబ్స్ ఎదిగింది. 2022లో దివీస్ ల్యాబ్స్ ఏకంగా 88 బిలియన్ల (8800 కోట్లు) వ్యాపారాన్ని చేసి చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో మురళీ దివి కీ చోటు కల్పించింది. ప్రస్తుతం మురళీ దివి లక్ష కోట్లకుపైగా సంపాదించి హైదరాబాద్‌లోనే అత్యంత సంపన్నుడిగా పేరు గడించారు. ఇది ఆయన ఒక్కడి విజయమే అయినప్పటికి .. ఒక తెలుగువాడిగా అతని సక్సెస్ స్టోరీ మనందరికి గర్వకారణమనే చెప్పాలి.

