ప్రభన్యూస్

Health Alert: మెట్లు ఎక్కేటప్పుడు ఊపిరి ఆడటం లేదా? ఈ లక్షణాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు! | లైఫ్ స్టైల్


Last Updated:

ఇటీవలి కాలంలో చాలా మంది లిఫ్ట్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మెట్లు ఎక్కే అలవాటు తగ్గిపోయింది. ఒకప్పుడు రోజూ మెట్లు ఎక్కడం సాధారణ విషయం అయితే, ఇప్పుడు రెండు లేదా మూడు అంతస్తులు ఎక్కినా చాలామందికి ఊపిరి సరిగా అందకపోవడం, ఆయాసం రావడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి.

News18
News18

ఇటీవలి కాలంలో చాలా మంది లిఫ్ట్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మెట్లు ఎక్కే అలవాటు తగ్గిపోయింది. ఒకప్పుడు రోజూ మెట్లు ఎక్కడం సాధారణ విషయం అయితే, ఇప్పుడు రెండు లేదా మూడు అంతస్తులు ఎక్కినా చాలామందికి ఊపిరి సరిగా అందకపోవడం, ఆయాసం రావడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. కొంతమంది దీనిని సాధారణ అలసటగా భావించి పట్టించుకోరు. కానీ ఈ లక్షణాలు తరచుగా కనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. కొన్నిసార్లు ఇది శారీరక దృఢత్వం తగ్గిపోవడం వల్ల వచ్చిన సమస్య కావచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో గుండె, ఊపిరితిత్తులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా ఇది సంకేతం కావచ్చు.

ఊపిరితిత్తుల నిపుణుడు డాక్టర్ అర్నాబ్ బేరా తెలిపిన వివరాల ప్రకారం, మెట్లు ఎక్కేటప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడానికి అనేక కారణాలు ఉంటాయి. శారీరక వ్యాయామం లేకపోవడం, అధిక బరువు, నీరసం లేదా శరీర దృఢత్వం తగ్గిపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య రావచ్చు. కానీ ప్రతిసారీ మెట్లు ఎక్కినప్పుడల్లా ఇదే సమస్య ఎదురవుతుంటే, దాని వెనుక ఉన్న అసలు కారణాన్ని తెలుసుకోవడానికి వైద్యుడిని సంప్రదించడం అవసరం.

గుండె శరీరమంతా ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని పంపించే ముఖ్యమైన అవయవం. గుండె సరిగా పనిచేయకపోతే శరీరానికి తగినంత ఆక్సిజన్ అందదు. దీంతో చిన్నపాటి శారీరక శ్రమ చేసినా ఊపిరి ఆడకపోవడం, ఛాతీలో బరువుగా అనిపించడం, ఆయాసం రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇలాంటి పరిస్థితిని నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం.

అలాగే ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు లేదా ఇతర శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారిలో కూడా మెట్లు ఎక్కేటప్పుడు శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. రక్తహీనత (అనీమియా) ఉన్నప్పుడు శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరైన స్థాయిలో అందకపోవడం వల్ల కూడా ఆయాసం వస్తుంది. అధిక బరువు ఉన్నవారిలో శరీరంపై అదనపు ఒత్తిడి పడటంతో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది. రోజువారీ వ్యాయామం చేయకపోవడం కూడా శరీర సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

ఒకవేళ తేలికపాటి పని చేసినా, కొద్దిగా నడిచినా లేదా మెట్లు ఎక్కిన వెంటనే ఛాతీ నొప్పి, తల తిరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఎక్కువసేపు శ్వాస సరిగా అందకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అవసరమైతే గుండె పరీక్షలు, ఊపిరితిత్తుల పరీక్షలు లేదా రక్త పరీక్షలు చేయించుకోవడం ద్వారా అసలు కారణాన్ని గుర్తించవచ్చు.

ఈ సమస్యను నివారించడానికి జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడవడం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం మంచిది. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. అధిక బరువు ఉంటే దాన్ని నియంత్రించాలి. ధూమపానం, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. తగినంత నీరు తాగడం, సరైన నిద్రపోవడం కూడా శ్వాసకోశ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇప్పటికే గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలి.

అయాసం రావడం ప్రతిసారీ తీవ్రమైన వ్యాధికి సంకేతం కాకపోవచ్చు. కానీ ఈ సమస్య తరచుగా వస్తూ ఉంటే లేదా రోజురోజుకూ పెరుగుతుంటే మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ముందుగానే పరీక్షలు చేయించుకుని సరైన చికిత్స తీసుకుంటే పెద్ద ఆరోగ్య సమస్యలను నివారించే అవకాశం ఉంటుంది. మీ శరీరం ఇచ్చే హెచ్చరికలను గమనించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 July 2026, 7:57 am Digital Edition : Prabhanews
Health Alert: మెట్లు ఎక్కేటప్పుడు ఊపిరి ఆడటం లేదా? ఈ లక్షణాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు! | లైఫ్ స్టైల్

Last Updated:Jul 20, 2026 3:43 PM ISTఇటీవలి కాలంలో చాలా మంది లిఫ్ట్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మెట్లు ఎక్కే అలవాటు తగ్గిపోయింది. ఒకప్పుడు రోజూ మెట్లు ఎక్కడం సాధారణ విషయం అయితే, ఇప్పుడు రెండు లేదా మూడు అంతస్తులు ఎక్కినా చాలామందికి ఊపిరి సరిగా అందకపోవడం, ఆయాసం రావడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి.News18ఇటీవలి కాలంలో చాలా మంది లిఫ్ట్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మెట్లు ఎక్కే అలవాటు తగ్గిపోయింది. ఒకప్పుడు రోజూ మెట్లు ఎక్కడం సాధారణ విషయం అయితే, ఇప్పుడు రెండు లేదా మూడు అంతస్తులు ఎక్కినా చాలామందికి ఊపిరి సరిగా అందకపోవడం, ఆయాసం రావడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. కొంతమంది దీనిని సాధారణ అలసటగా భావించి పట్టించుకోరు. కానీ ఈ లక్షణాలు తరచుగా కనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. కొన్నిసార్లు ఇది శారీరక దృఢత్వం తగ్గిపోవడం వల్ల వచ్చిన సమస్య కావచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో గుండె, ఊపిరితిత్తులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా ఇది సంకేతం కావచ్చు.ఊపిరితిత్తుల నిపుణుడు డాక్టర్ అర్నాబ్ బేరా తెలిపిన వివరాల ప్రకారం, మెట్లు ఎక్కేటప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడానికి అనేక కారణాలు ఉంటాయి. శారీరక వ్యాయామం లేకపోవడం, అధిక బరువు, నీరసం లేదా శరీర దృఢత్వం తగ్గిపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య రావచ్చు. కానీ ప్రతిసారీ మెట్లు ఎక్కినప్పుడల్లా ఇదే సమస్య ఎదురవుతుంటే, దాని వెనుక ఉన్న అసలు కారణాన్ని తెలుసుకోవడానికి వైద్యుడిని సంప్రదించడం అవసరం.గుండె శరీరమంతా ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని పంపించే ముఖ్యమైన అవయవం. గుండె సరిగా పనిచేయకపోతే శరీరానికి తగినంత ఆక్సిజన్ అందదు. దీంతో చిన్నపాటి శారీరక శ్రమ చేసినా ఊపిరి ఆడకపోవడం, ఛాతీలో బరువుగా అనిపించడం, ఆయాసం రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇలాంటి పరిస్థితిని నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం.అలాగే ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు లేదా ఇతర శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారిలో కూడా మెట్లు ఎక్కేటప్పుడు శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. రక్తహీనత (అనీమియా) ఉన్నప్పుడు శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరైన స్థాయిలో అందకపోవడం వల్ల కూడా ఆయాసం వస్తుంది. అధిక బరువు ఉన్నవారిలో శరీరంపై అదనపు ఒత్తిడి పడటంతో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది. రోజువారీ వ్యాయామం చేయకపోవడం కూడా శరీర సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.ఒకవేళ తేలికపాటి పని చేసినా, కొద్దిగా నడిచినా లేదా మెట్లు ఎక్కిన వెంటనే ఛాతీ నొప్పి, తల తిరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఎక్కువసేపు శ్వాస సరిగా అందకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అవసరమైతే గుండె పరీక్షలు, ఊపిరితిత్తుల పరీక్షలు లేదా రక్త పరీక్షలు చేయించుకోవడం ద్వారా అసలు కారణాన్ని గుర్తించవచ్చు.ఈ సమస్యను నివారించడానికి జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడవడం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం మంచిది. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. అధిక బరువు ఉంటే దాన్ని నియంత్రించాలి. ధూమపానం, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. తగినంత నీరు తాగడం, సరైన నిద్రపోవడం కూడా శ్వాసకోశ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇప్పటికే గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలి.అయాసం రావడం ప్రతిసారీ తీవ్రమైన వ్యాధికి సంకేతం కాకపోవచ్చు. కానీ ఈ సమస్య తరచుగా వస్తూ ఉంటే లేదా రోజురోజుకూ పెరుగుతుంటే మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ముందుగానే పరీక్షలు చేయించుకుని సరైన చికిత్స తీసుకుంటే పెద్ద ఆరోగ్య సమస్యలను నివారించే అవకాశం ఉంటుంది. మీ శరీరం ఇచ్చే హెచ్చరికలను గమనించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link