ఉదాహరణకు, ఒక ఉద్యోగి చివరిగా తీసుకున్న జీతం (బేసిక్ జీతం + డియర్నెస్ అలవెన్స్) నెలకు రూ.40,000 అనుకుందాం. ఆ ఉద్యోగి ఐదు సంవత్సరాల సేవ పూర్తి చేస్తే గ్రాట్యుటీ మొత్తం సుమారు రూ.1,15,385 వస్తుంది. (రూ.40,000 × 15 × 5) ÷ 26 = రూ.1,15,385. ఆరు సంవత్సరాల సేవ పూర్తయితే గ్రాట్యుటీ మొత్తం సుమారు రూ.1,38,462కి పెరుగుతుంది. ఏడు సంవత్సరాల సేవకు సుమారు రూ.1,61,538 వస్తుంది. ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేస్తే గ్రాట్యుటీ మొత్తం సుమారు రూ.1,84,615 అవుతుంది. తొమ్మిది సంవత్సరాల సేవకు దాదాపు రూ.2,07,692 వస్తుంది. అదే ఉద్యోగి పది సంవత్సరాల పాటు నిరంతరంగా పనిచేస్తే సుమారు రూ.2,30,769 గ్రాట్యుటీగా పొందుతారు. ఈ లెక్కల ద్వారా ఉద్యోగి ఎక్కువ కాలం పనిచేస్తే చివర్లో అందుకునే గ్రాట్యుటీ ప్రయోజనం గణనీయంగా పెరుగుతుందని అర్థమవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)

