“ధరలకు అనుగుణంగా గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబడులు తగ్గినప్పటికీ, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు కొనసాగడం, ఓటీసీ పెట్టుబడులు పెరగడం వల్ల తొలి ఆరు నెలల్లో మొత్తం బంగారం డిమాండ్ 2 శాతం పెరిగింది” అని లూయిస్ స్ట్రీట్ తెలిపారు. 2026 రెండో భాగంలో పెట్టుబడులే బంగారం డిమాండ్ పెరుగుదలకు ప్రధాన కారణంగా ఉండొచ్చని ఆమె అంచనా వేశారు. అయితే పెట్టుబడి విధానంలో మార్పులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆసియా పెట్టుబడిదారుల నుంచి వచ్చే డిమాండ్, ఓటీసీ మార్కెట్ కార్యకలాపాలు మరింత కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని చెప్పారు. మరోవైపు పశ్చిమ దేశాల్లో గోల్డ్ ఈటీఎఫ్‌లపై ఆసక్తి వాస్తవ రాబడులు, అమెరికా ద్రవ్య విధాన అంచనాలు, డాలర్ విలువపై ఎక్కువగా ఆధారపడవచ్చని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)

