దేశవ్యాప్తంగా 307 జిల్లాల్లోని పట్టణ కుటుంబాల నుంచి 67,000కు పైగా స్పందనలతో లోకల్‌సర్కిల్స్ ఈ సర్వే నిర్వహించింది. సర్వే ప్రకారం, 57 శాతం కుటుంబాలు పండుగల కోసం అదనపు ఖర్చులు చేయాలని భావిస్తున్నాయి. అయితే, 31 శాతం కుటుంబాలు సాధారణ ఖర్చులకు మించి కొనుగోళ్లు చేయబోమని తెలిపాయి. దుస్తులు, ఫ్యాషన్ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని 72 శాతం మంది భావిస్తుండగా, 45 శాతం మంది గృహోపకరణాలు, ఫర్నిచర్ లేదా ప్రయాణాల కోసం ఖర్చు చేయాలని అనుకుంటున్నారు. సుమారు 9 శాతం కుటుంబాలు రూ.లక్షకు పైగా ఖర్చు చేసే అవకాశం ఉంది. మరోవైపు, 83 శాతం కుటుంబాలు పండుగల ఖర్చులకు తమ పొదుపులో కొంత మొత్తాన్ని ఉపయోగించుకోనున్నాయి. వీరిలో 34 శాతం మంది మొత్తం ఖర్చులో కనీసం 25 శాతాన్ని పొదుపు నుంచే చెల్లించనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)

