European Protests: భగ్గుమంటున్న ఫ్రాన్స్, అల్బేనియా.. యూరప్‌లోని పలు దేశాల్లో తీవ్ర హింస! |


Last Updated:

పెరుగుతున్న జీవన వ్యయం, ప్రభుత్వ వైఫల్యాలపై యూరప్ దేశాల్లో భారీ నిరసనలు వెల్లువెత్తాయి. ఫ్రాన్స్, అల్బేనియాల్లో ఆందోళనలు తీవ్ర హింసాత్మకంగా మారగా, ఇటలీ, పోర్చుగల్, బెల్జియం దేశాల్లో పోలీసులతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

News18
News18

యూరప్ వ్యాప్తంగా ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. నిత్యావసరాల ధరలు పెరగడం, దిగజారుతున్న ప్రజా సేవలు, విద్యా ప్రమాణాల పతనంపై పలు దేశాల్లో ప్రజలు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చారు. శనివారం ఫ్రాన్స్, అల్బేనియా, ఇటలీ, పోర్చుగల్, బెల్జియం దేశాల్లో జరిగిన ప్రదర్శనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ముఖ్యంగా ఫ్రాన్స్, అల్బేనియాల్లో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. నిరసనకారులు ప్రభుత్వ భవనాలకు నిప్పు పెట్టడం, వాహనాలను తగులబెట్టడంతో పోలీసులు లాఠీఛార్జ్, బాష్పవాయువు, వాటర్ కెనాన్లను ప్రయోగించారు. ఈ అల్లర్లలో వందలాది మంది గాయపడగా, భారీగా ఆస్తుల నష్టం వాటిల్లింది. ప్రభుత్వాల ఆర్థిక విధానాలు, అవినీతిపై ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తి ఈ స్థాయి తీవ్ర నిరసనలకు కారణమైంది.

ఫ్రాన్స్‌లో విధ్వంసం.. 1,200 మంది అరెస్ట్

న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం… ఫ్రాన్స్‌లో దాదాపు 8 లక్షల మంది వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. రాజధాని ప్యారిస్‌తో పాటు లిమోజెస్, మార్సెల్లే, లియాన్ నగరాల్లో ఆందోళనలు రణరంగాన్ని తలపించాయి. లిమోజెస్‌లో సిటీ హాల్‌ను దహనం చేయగా, దుకాణాల లూటీలు జరిగాయి. ఈ ఘర్షణల్లో 150 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. హింసను సహించేది లేదని ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను స్పష్టం చేశారు. ఇప్పటివరకు 1,200 మందిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.

అల్బేనియాలో ప్రధాని రాజీనామాకు డిమాండ్

అల్బేనియా రాజధాని టిరానాలో ప్రధాని ఎడి రామా రాజీనామా చేయాలంటూ చేపట్టిన ఆందోళనలు ఐదో రోజుకు చేరాయి. నిరసనకారులు పెట్రోల్ బాంబులు, రాళ్లతో దాడులు చేయడంతో పోలీసులు మొదటిసారి రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. సుప్రీంకోర్టు, పోస్టాఫీసు భవనాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. వారం రోజుల్లో 132 మంది పోలీసులు సహా పదుల సంఖ్యలో విద్యార్థులు గాయపడగా, 167 మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఇటలీలో వాటర్ కెనాన్లు.. బాష్పవాయువు

ఇటలీలోని మిలన్, బొలోగ్నా నగరాల్లో పెరిగిన జీవన వ్యయానికి వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీలు ఉద్రిక్తంగా మారాయి. సెంట్రల్ కేథడ్రల్ స్క్వేర్ వద్ద ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. బొలోగ్నాలో గుమిగూడిన నిరసనకారులపై వాటర్ కెనాన్లను ఉపయోగించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

పోర్చుగల్, బెల్జియంలో విద్యార్థుల పోరు

పోర్చుగల్ రాజధాని లిస్బన్‌లో ఇళ్ల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా వేలాది మంది కదం తొక్కారు. 2017 నుంచి అక్కడ ఇళ్ల ధరలు రెట్టింపు కావడంతో తీవ్ర నివాస సంక్షోభం నెలకొంది. మరోవైపు బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో విద్యా ఖర్చులు పెరగడాన్ని నిరసిస్తూ వందలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు.

యూరప్ దేశాల్లో వివిధ కారణాలతో మొదలైన ఈ ఉద్యమం ప్రస్తుతం ప్రభుత్వాలకు పెను సవాలుగా మారింది. నిరసనకారుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై స్వతంత్ర విచారణలు మొదలయ్యాయి. ప్రజా సమస్యలను పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని ప్రజలు హెచ్చరిస్తుండటంతో యూరప్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 October 2026, 3:18 pm Digital Edition : Prabhanews
European Protests: భగ్గుమంటున్న ఫ్రాన్స్, అల్బేనియా.. యూరప్‌లోని పలు దేశాల్లో తీవ్ర హింస! |

Last Updated:Oct 18, 2026 3:10 PM ISTపెరుగుతున్న జీవన వ్యయం, ప్రభుత్వ వైఫల్యాలపై యూరప్ దేశాల్లో భారీ నిరసనలు వెల్లువెత్తాయి. ఫ్రాన్స్, అల్బేనియాల్లో ఆందోళనలు తీవ్ర హింసాత్మకంగా మారగా, ఇటలీ, పోర్చుగల్, బెల్జియం దేశాల్లో పోలీసులతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి.News18యూరప్ వ్యాప్తంగా ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. నిత్యావసరాల ధరలు పెరగడం, దిగజారుతున్న ప్రజా సేవలు, విద్యా ప్రమాణాల పతనంపై పలు దేశాల్లో ప్రజలు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చారు. శనివారం ఫ్రాన్స్, అల్బేనియా, ఇటలీ, పోర్చుగల్, బెల్జియం దేశాల్లో జరిగిన ప్రదర్శనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ముఖ్యంగా ఫ్రాన్స్, అల్బేనియాల్లో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. నిరసనకారులు ప్రభుత్వ భవనాలకు నిప్పు పెట్టడం, వాహనాలను తగులబెట్టడంతో పోలీసులు లాఠీఛార్జ్, బాష్పవాయువు, వాటర్ కెనాన్లను ప్రయోగించారు. ఈ అల్లర్లలో వందలాది మంది గాయపడగా, భారీగా ఆస్తుల నష్టం వాటిల్లింది. ప్రభుత్వాల ఆర్థిక విధానాలు, అవినీతిపై ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తి ఈ స్థాయి తీవ్ర నిరసనలకు కారణమైంది.ఫ్రాన్స్‌లో విధ్వంసం.. 1,200 మంది అరెస్ట్న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం... ఫ్రాన్స్‌లో దాదాపు 8 లక్షల మంది వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. రాజధాని ప్యారిస్‌తో పాటు లిమోజెస్, మార్సెల్లే, లియాన్ నగరాల్లో ఆందోళనలు రణరంగాన్ని తలపించాయి. లిమోజెస్‌లో సిటీ హాల్‌ను దహనం చేయగా, దుకాణాల లూటీలు జరిగాయి. ఈ ఘర్షణల్లో 150 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. హింసను సహించేది లేదని ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను స్పష్టం చేశారు. ఇప్పటివరకు 1,200 మందిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.అల్బేనియాలో ప్రధాని రాజీనామాకు డిమాండ్అల్బేనియా రాజధాని టిరానాలో ప్రధాని ఎడి రామా రాజీనామా చేయాలంటూ చేపట్టిన ఆందోళనలు ఐదో రోజుకు చేరాయి. నిరసనకారులు పెట్రోల్ బాంబులు, రాళ్లతో దాడులు చేయడంతో పోలీసులు మొదటిసారి రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. సుప్రీంకోర్టు, పోస్టాఫీసు భవనాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. వారం రోజుల్లో 132 మంది పోలీసులు సహా పదుల సంఖ్యలో విద్యార్థులు గాయపడగా, 167 మందిని అదుపులోకి తీసుకున్నారు.ఇటలీలో వాటర్ కెనాన్లు.. బాష్పవాయువుఇటలీలోని మిలన్, బొలోగ్నా నగరాల్లో పెరిగిన జీవన వ్యయానికి వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీలు ఉద్రిక్తంగా మారాయి. సెంట్రల్ కేథడ్రల్ స్క్వేర్ వద్ద ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. బొలోగ్నాలో గుమిగూడిన నిరసనకారులపై వాటర్ కెనాన్లను ఉపయోగించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.పోర్చుగల్, బెల్జియంలో విద్యార్థుల పోరుపోర్చుగల్ రాజధాని లిస్బన్‌లో ఇళ్ల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా వేలాది మంది కదం తొక్కారు. 2017 నుంచి అక్కడ ఇళ్ల ధరలు రెట్టింపు కావడంతో తీవ్ర నివాస సంక్షోభం నెలకొంది. మరోవైపు బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో విద్యా ఖర్చులు పెరగడాన్ని నిరసిస్తూ వందలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు.యూరప్ దేశాల్లో వివిధ కారణాలతో మొదలైన ఈ ఉద్యమం ప్రస్తుతం ప్రభుత్వాలకు పెను సవాలుగా మారింది. నిరసనకారుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై స్వతంత్ర విచారణలు మొదలయ్యాయి. ప్రజా సమస్యలను పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని ప్రజలు హెచ్చరిస్తుండటంతో యూరప్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.మరింత చదవండి

Source link