గతంలో ఒక్కో అవసరానికి వేర్వేరు విత్‌డ్రాయల్ నిబంధనలు ఉండేవి. ఇప్పుడు ఉన్న 13 రకాల విత్‌డ్రాయల్ నిబంధనలను మూడు ప్రధాన కేటగిరీలుగా మార్చారు. అవి ఎసెన్షియల్ నీడ్స్, హౌసింగ్ నీడ్స్, స్పెషల్ సర్కమ్‌స్టాన్సెస్. ఎసెన్షియల్ నీడ్స్ కేటగిరీలో అనారోగ్యం, విద్య, వివాహ ఖర్చులు ఉంటాయి. విద్య కోసం గరిష్ఠంగా 10 సార్లు, వివాహం కోసం గరిష్ఠంగా 5 సార్లు డబ్బు తీసుకోవచ్చు. కొత్త నిబంధనలు డబ్బు తీసుకునే విషయంలో మరింత వెసులుబాటు ఇస్తున్నప్పటికీ, పీఎఫ్ బ్యాలెన్స్‌లో కనీసం 25 శాతం తప్పనిసరిగా మిగిలి ఉండాలి. ఇది రిటైర్మెంట్ సమయంలో ఆర్థిక భద్రత కోసం ఉంచే మొత్తంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)

