ప్రభన్యూస్

Election Commission Of India: SIR వివాదంపై ఈసీ స్ట్రాంగ్ కౌంటర్.. కీలక నిర్ణయం! |


Last Updated:

Election Commission Of India: ఓటర్ల జాబితాల ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (SIR) ప్రక్రియపై దేశవ్యాప్తంగా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఓటర్లకు భారీ ఊరటనిచ్చేలా శనివారం కీలక నిర్ణయాలను ప్రకటించింది.

ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా

ఓటర్ల ధ్రువీకరణ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు పలు చర్యలను చేపట్టింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషిల నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.  ఓటర్ల రికార్డులు మ్యాపింగ్ కాకపోవడం వల్ల గానీ, తార్కిక వ్యత్యాసాల (లాజికల్ డిస్క్రిపెన్సీలు) కారణంగా గానీ నోటీసులు అందుకున్న ఓటర్లు వ్యక్తిగతంగా ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్వో) ఎదుట హాజరుకావాల్సిన అవసరం సాధారణంగా ఉండదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అందుకు బదులుగా, బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) స్వయంగా అలాంటి ఓటర్ల ఇళ్లకు వెళ్లి, అవసరమైన పత్రాలను సేకరించి ‘ఈసీఐనెట్’ (ECINet) పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు.

అత్యంత అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే విచారణలు (హియరింగ్స్) ఉంటాయని, అవి కూడా వీలైనంత వరకు ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహిస్తామని తెలిపింది. ఒకవేళ విచారణకు హాజరుకావాల్సి వస్తే, ఓటరు అనుమతించిన వారి కుటుంబ సభ్యులు కూడా ఓటరు తరఫున హాజరుకావచ్చని పేర్కొంది.

నిరాశ్రయులు, పేదల కోసం ప్రత్యేక శిబిరాలు

ఎస్ఐఆర్ ప్రక్రియలో ఇబ్బందులు ఎదుర్కొనే అట్టడుగు వర్గాల ప్రజల సహాయార్థం జిల్లా ఎన్నికల అధికారులు (డీఈవోలు) ప్రత్యేక శిబిరాలు, హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని కమిషన్ ఆదేశించింది. రాత్రి పూట ఆశ్రయాల్లో (నైట్ షెల్టర్లు) ఉండే నిరాశ్రయులు, కార్మికులు, పేద ప్రజలకు ఈ శిబిరాల ద్వారా అవసరమైన సహాయం అందనుంది.

‘ఈసీఐనెట్’ వ్యవస్థపై సమీక్ష

ఎన్నికల చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ‘ఈసీఐనెట్’ వ్యవస్థ పనిచేస్తోందా లేదా అన్న విషయాన్ని పరిశీలించేందుకు సమగ్ర సమీక్షకు కమిషన్ ఆదేశించింది. సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నేతృత్వంలోని కమిటీ ఈ సమీక్షను చేపడుతుంది. ఇందులో ఐఐటీ (IIT) లేదా ట్రిపుల్ ఐటీ (IIIT)కి చెందిన ఒక స్వతంత్ర నిపుణుడు కూడా సభ్యుడిగా ఉంటారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో పాత ఓటర్ల జాబితాలను శోధించడం, నోటీసులపై పత్రాలను దాఖలు చేయడం వంటి పలు సేవలను ప్రస్తుతం ఈసీఐనెట్ అందిస్తోంది.

ఢిల్లీ, మహారాష్ట్రలకు గడువు పెంపు

ఢిల్లీలో క్లెయిమ్‌లు, అభ్యంతరాల దాఖలుకు చివరి గడువును 2026 అక్టోబర్ 30 వరకు ఎన్నికల సంఘం పొడిగించింది. నోటీసులు, క్లెయిమ్‌లు మరియు అభ్యంతరాల పరిష్కార గడువును నవంబర్ 30 వరకు పొడిగించారు. అలాగే మహారాష్ట్రలో అక్టోబర్ 12 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలను సమర్పించవచ్చని, వాటి పరిష్కార గడువును నవంబర్ 10, 2026 వరకు పొడిగించినట్లు తెలిపింది. కొనసాగుతున్న సవరణ ప్రక్రియలో ఢిల్లీ, మహారాష్ట్రలు ఒకే దశలో ఉన్నాయి.

20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ముగిసిన ఎస్ఐఆర్

ఇప్పటికే 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిందని ఈసీ వెల్లడించింది. యువత, తొలిసారి ఓటుహక్కు పొందినవారు సహా ఓటర్ల జాబితాలో పేర్లు లేనివారు నిరంతర నవీకరణ (కంటిన్యూయస్ అప్‌డేషన్) ప్రక్రియ ద్వారా పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపింది.

వివాదాల నడుమ ఏకగ్రీవ నిర్ణయాల సమర్థన

ఎస్ఐఆర్ ప్రక్రియపై ఎన్నికల సంఘం అంతర్గతంగా విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై ఈసీ వివరణ ఇచ్చింది. ఎస్ఐఆర్ ఉత్తర్వులు, తదుపరి షెడ్యూళ్లను పూర్తి కమిషన్ ఏకగ్రీవంగానే ఆమోదించిందని పునరుద్ఘాటించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించేలా 2025 జూన్ 24న ఎస్ఐఆర్ ఉత్తర్వు జారీ అయిందని, బీహార్‌తో మొదలై పశ్చిమ బెంగాల్ మరియు ఇతర రాష్ట్రాలకు విస్తరించిందని పేర్కొంది.

ఎస్ఐఆర్ ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించిన విషయాన్ని ఈసీ గుర్తుచేసింది. ఎస్ఐఆర్ కాలానికి సంబంధించి ఫారం-6కు జతచేసిన డిక్లరేషన్‌ను కూడా సుప్రీంకోర్టు సమర్థించిందని తెలిపింది. ఎస్ఐఆర్ లేని సమయాల్లో ‘రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్, 1960’ ప్రకారమే సాధారణ ఫారాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. తాజా ప్రెస్ నోట్ కూడా పూర్తి కమిషన్ ఆమోదంతోనే విడుదలైందని పేర్కొంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 September 2026, 10:05 am Digital Edition : Prabhanews
Election Commission Of India: SIR వివాదంపై ఈసీ స్ట్రాంగ్ కౌంటర్.. కీలక నిర్ణయం! |

Last Updated:Sep 27, 2026 9:58 AM ISTElection Commission Of India: ఓటర్ల జాబితాల 'ప్రత్యేక సమగ్ర సవరణ' (SIR) ప్రక్రియపై దేశవ్యాప్తంగా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఓటర్లకు భారీ ఊరటనిచ్చేలా శనివారం కీలక నిర్ణయాలను ప్రకటించింది.ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాఓటర్ల ధ్రువీకరణ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు పలు చర్యలను చేపట్టింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషిల నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.  ఓటర్ల రికార్డులు మ్యాపింగ్ కాకపోవడం వల్ల గానీ, తార్కిక వ్యత్యాసాల (లాజికల్ డిస్క్రిపెన్సీలు) కారణంగా గానీ నోటీసులు అందుకున్న ఓటర్లు వ్యక్తిగతంగా ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్వో) ఎదుట హాజరుకావాల్సిన అవసరం సాధారణంగా ఉండదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అందుకు బదులుగా, బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) స్వయంగా అలాంటి ఓటర్ల ఇళ్లకు వెళ్లి, అవసరమైన పత్రాలను సేకరించి 'ఈసీఐనెట్' (ECINet) పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు.అత్యంత అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే విచారణలు (హియరింగ్స్) ఉంటాయని, అవి కూడా వీలైనంత వరకు ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహిస్తామని తెలిపింది. ఒకవేళ విచారణకు హాజరుకావాల్సి వస్తే, ఓటరు అనుమతించిన వారి కుటుంబ సభ్యులు కూడా ఓటరు తరఫున హాజరుకావచ్చని పేర్కొంది.నిరాశ్రయులు, పేదల కోసం ప్రత్యేక శిబిరాలుఎస్ఐఆర్ ప్రక్రియలో ఇబ్బందులు ఎదుర్కొనే అట్టడుగు వర్గాల ప్రజల సహాయార్థం జిల్లా ఎన్నికల అధికారులు (డీఈవోలు) ప్రత్యేక శిబిరాలు, హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని కమిషన్ ఆదేశించింది. రాత్రి పూట ఆశ్రయాల్లో (నైట్ షెల్టర్లు) ఉండే నిరాశ్రయులు, కార్మికులు, పేద ప్రజలకు ఈ శిబిరాల ద్వారా అవసరమైన సహాయం అందనుంది.'ఈసీఐనెట్' వ్యవస్థపై సమీక్షఎన్నికల చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా 'ఈసీఐనెట్' వ్యవస్థ పనిచేస్తోందా లేదా అన్న విషయాన్ని పరిశీలించేందుకు సమగ్ర సమీక్షకు కమిషన్ ఆదేశించింది. సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నేతృత్వంలోని కమిటీ ఈ సమీక్షను చేపడుతుంది. ఇందులో ఐఐటీ (IIT) లేదా ట్రిపుల్ ఐటీ (IIIT)కి చెందిన ఒక స్వతంత్ర నిపుణుడు కూడా సభ్యుడిగా ఉంటారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో పాత ఓటర్ల జాబితాలను శోధించడం, నోటీసులపై పత్రాలను దాఖలు చేయడం వంటి పలు సేవలను ప్రస్తుతం ఈసీఐనెట్ అందిస్తోంది.ఢిల్లీ, మహారాష్ట్రలకు గడువు పెంపుఢిల్లీలో క్లెయిమ్‌లు, అభ్యంతరాల దాఖలుకు చివరి గడువును 2026 అక్టోబర్ 30 వరకు ఎన్నికల సంఘం పొడిగించింది. నోటీసులు, క్లెయిమ్‌లు మరియు అభ్యంతరాల పరిష్కార గడువును నవంబర్ 30 వరకు పొడిగించారు. అలాగే మహారాష్ట్రలో అక్టోబర్ 12 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలను సమర్పించవచ్చని, వాటి పరిష్కార గడువును నవంబర్ 10, 2026 వరకు పొడిగించినట్లు తెలిపింది. కొనసాగుతున్న సవరణ ప్రక్రియలో ఢిల్లీ, మహారాష్ట్రలు ఒకే దశలో ఉన్నాయి.20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ముగిసిన ఎస్ఐఆర్ఇప్పటికే 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిందని ఈసీ వెల్లడించింది. యువత, తొలిసారి ఓటుహక్కు పొందినవారు సహా ఓటర్ల జాబితాలో పేర్లు లేనివారు నిరంతర నవీకరణ (కంటిన్యూయస్ అప్‌డేషన్) ప్రక్రియ ద్వారా పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపింది.వివాదాల నడుమ ఏకగ్రీవ నిర్ణయాల సమర్థనఎస్ఐఆర్ ప్రక్రియపై ఎన్నికల సంఘం అంతర్గతంగా విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై ఈసీ వివరణ ఇచ్చింది. ఎస్ఐఆర్ ఉత్తర్వులు, తదుపరి షెడ్యూళ్లను పూర్తి కమిషన్ ఏకగ్రీవంగానే ఆమోదించిందని పునరుద్ఘాటించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించేలా 2025 జూన్ 24న ఎస్ఐఆర్ ఉత్తర్వు జారీ అయిందని, బీహార్‌తో మొదలై పశ్చిమ బెంగాల్ మరియు ఇతర రాష్ట్రాలకు విస్తరించిందని పేర్కొంది.ఎస్ఐఆర్ ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించిన విషయాన్ని ఈసీ గుర్తుచేసింది. ఎస్ఐఆర్ కాలానికి సంబంధించి ఫారం-6కు జతచేసిన డిక్లరేషన్‌ను కూడా సుప్రీంకోర్టు సమర్థించిందని తెలిపింది. ఎస్ఐఆర్ లేని సమయాల్లో 'రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్, 1960' ప్రకారమే సాధారణ ఫారాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. తాజా ప్రెస్ నోట్ కూడా పూర్తి కమిషన్ ఆమోదంతోనే విడుదలైందని పేర్కొంది.మరింత చదవండి

Source link