ప్రభన్యూస్

Destiny: జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ హీరోగా ‘డెస్టినీ’.. నందినీ రెడ్డి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

చెందు ముద్దు దర్శకత్వంలో జబర్దస్త్ ఇమాన్యుయేల్ లీడ్ రోల్ లో రాబోతున్న కొత్త సినిమా ‘డెస్టినీ’. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

News18
News18

కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దినేష్ కుర్ర నిర్మిస్తున్న చిత్రం ‘డెస్టినీ’. ఈ మూవీకి చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో జబర్దస్త్ ఇమాన్యుయేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. శ్రీ సత్య, ఆమని, రవి ప్రకాష్, కిరీటి, శివ కోట్ల ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నందినీ రెడ్డి విడుదల చేసి టీంకు బెస్ట్ విషెస్ అందించారు.

ఈ పోస్టర్‌ను గమనిస్తుంటే.. ‘డెస్టినీ’ టైటిల్‌కి తగ్గట్టుగా సరిగ్గా డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది. పోస్టర్‌లో కనిపించే సంకెళ్లు.. ఇమాన్యుయేల్ కనిపించే తీరు, పక్కనే ఉన్న కానిస్టేబుల్.. ఆ దారి.. ఆ అడవి ఇవన్నీ చూస్తుంటే.. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏదో చెప్పబోతోన్నారని అర్థం అవుతోంది. టైటిల్‌‌ లోగోలోనూ ఈ ఇద్దరే కనిపిస్తున్నారు. అలా ఈ ఇద్దరి ప్రయాణమే సినిమాగా తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ఇతర అప్డేట్‌లను ప్రకటించనున్నారు.

ఈ మూవీకి మారుతి రాజా సంగీతం అందిస్తుండగా, పంకజ్ తొట్టాడ కెమెరామెన్‌గా వర్క్ చేస్తున్నారు. డి. వెంకట ప్రభు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, శ్రీ సత్య, ఆమని, రవి ప్రకాష్, కిరీటి, శివ కోట్ల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ చెబుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 October 2026, 11:20 am Digital Edition : Prabhanews
Destiny: జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ హీరోగా ‘డెస్టినీ’.. నందినీ రెడ్డి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 17, 2026 11:14 AM ISTచెందు ముద్దు దర్శకత్వంలో జబర్దస్త్ ఇమాన్యుయేల్ లీడ్ రోల్ లో రాబోతున్న కొత్త సినిమా ‘డెస్టినీ’. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
News18కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దినేష్ కుర్ర నిర్మిస్తున్న చిత్రం ‘డెస్టినీ’. ఈ మూవీకి చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో జబర్దస్త్ ఇమాన్యుయేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. శ్రీ సత్య, ఆమని, రవి ప్రకాష్, కిరీటి, శివ కోట్ల ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నందినీ రెడ్డి విడుదల చేసి టీంకు బెస్ట్ విషెస్ అందించారు.ఈ పోస్టర్‌ను గమనిస్తుంటే.. ‘డెస్టినీ’ టైటిల్‌కి తగ్గట్టుగా సరిగ్గా డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది. పోస్టర్‌లో కనిపించే సంకెళ్లు.. ఇమాన్యుయేల్ కనిపించే తీరు, పక్కనే ఉన్న కానిస్టేబుల్.. ఆ దారి.. ఆ అడవి ఇవన్నీ చూస్తుంటే.. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏదో చెప్పబోతోన్నారని అర్థం అవుతోంది. టైటిల్‌‌ లోగోలోనూ ఈ ఇద్దరే కనిపిస్తున్నారు. అలా ఈ ఇద్దరి ప్రయాణమే సినిమాగా తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ఇతర అప్డేట్‌లను ప్రకటించనున్నారు.ఈ మూవీకి మారుతి రాజా సంగీతం అందిస్తుండగా, పంకజ్ తొట్టాడ కెమెరామెన్‌గా వర్క్ చేస్తున్నారు. డి. వెంకట ప్రభు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, శ్రీ సత్య, ఆమని, రవి ప్రకాష్, కిరీటి, శివ కోట్ల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ చెబుతున్నారు.మరింత చదవండి

Source link