ప్రభన్యూస్

Delhi Protest: ఢిల్లీలో నిరసనలకు కొత్త వేదికలు.. జంతర్ మంతర్‌లో ఇక ఆందోళనలు చేయలేరా? |


Last Updated:

దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు నిర్వహించే విషయంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. దశాబ్దాలుగా రాజకీయ ఆందోళనలకు వేదికగా ఉన్న జంతర్ మంతర్‌ను అధికారిక నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగించారు. మరి, ఈ మార్పు ఎలాంటి ప్రభావం చూపనుంది?

News18
News18

దేశ రాజధాని ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు నిర్వహించే ప్రదేశాల విషయంలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఇప్పటివరకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు తమ ఆందోళనలు చేపట్టేందుకు ఉపయోగించిన జంతర్ మంతర్ ఇకపై అధికారిక నిరసన వేదికల జాబితాలో ఉండదు. ఢిల్లీ పోలీసులు తాజాగా జారీ చేసిన కొత్త ఉత్తర్వుల ప్రకారం, నిరసనల కోసం మూడు ప్రత్యామ్నాయ ప్రాంతాలను గుర్తించారు. కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

మూడు ప్రాంతాల్లో నిరసనలకు అవకాశం

ఢిల్లీ పోలీసుల స్టాండింగ్ ఆర్డర్ నంబర్ L&O/48/2026 ప్రకారం.. రామ్‌లీలా మైదాన్, బురారీ మైదాన్, తూర్పు ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్‌లను నిరసన ప్రదేశాలుగా ఎంపిక చేశారు. వీటిలో రామ్‌లీలా మైదాన్‌ మధ్య ఢిల్లీలో ఉండగా, బురారీ మైదాన్‌ ఉత్తర ఢిల్లీలో ఉంది. సీబీడీ గ్రౌండ్‌ తూర్పు ఢిల్లీలో ఉంది. ఈ మూడు ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించేందుకు అనుసరించాల్సిన విధివిధానాలు, నిబంధనలతో కూడిన ప్రత్యేక ప్రామాణిక నిర్వహణ మార్గదర్శకాలను (ఎస్‌వోపీలు) త్వరలో విడుదల చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ నిర్ణయం 2022 ఏప్రిల్ 28న జారీ చేసిన పాత స్టాండింగ్ ఆర్డర్‌కు పాక్షిక సవరణగా అమల్లోకి వచ్చింది. గతంలో జంతర్ మంతర్ రాజకీయ నిరసనలు, ప్రజా సమస్యలపై ఆందోళనలు, వివిధ సంఘాల ఉద్యమాలకు ప్రధాన కేంద్రంగా ఉండేది. తాజా మార్పుతో ఆ ప్రదేశం అధికారిక నిరసన వేదికల జాబితా నుంచి తొలగిపోయింది.

సీజేపీ నిరసనకు అనుమతి వివాదం

ఎన్నికల సంఘం వ్యవహారాలు, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ప్రతిపక్షాలు నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కూడా ఇదే అంశాలపై జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహించేందుకు అనుమతి కోరింది.

అక్టోబర్ 10న చేపట్టాలనుకున్న తమ నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారని సీజేపీ తెలిపింది. నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేయకపోవడమే ఇందుకు కారణమని పోలీసులు పేర్కొన్నారు. దీంతో సోమవారం సీజేపీ కార్యకర్తలు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిరసనకు అధికారిక అనుమతి ఇవ్వాలని కోరారు. తమ ఆందోళనకు సంబంధించిన తేదీ, సమయాన్ని 24 గంటల్లోగా తెలియజేయాలని పోలీసులకు గడువు విధించారు.

సుప్రీంకోర్టు సూచనల నేపథ్యంలో నిర్ణయం

నిరసన వేదికల మార్పునకు సుప్రీంకోర్టు చేసిన సూచనలు కూడా నేపథ్యంగా నిలిచాయి. అక్టోబర్ 9న ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, న్యాయమూర్తులు జాయ్‌మాల్య బాగ్చి, వి. మోహనాలతో కలిసి, జంతర్ మంతర్‌కు ప్రత్యామ్నాయంగా మెరుగైన సదుపాయాలున్న ప్రదేశాన్ని గుర్తించాలని కేంద్రం, ఢిల్లీ అధికారులకు సూచించింది.

నిరసనల్లో పాల్గొనేవారికి తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సదుపాయాలు వంటి కనీస వసతులు అందుబాటులో ఉండాలని ధర్మాసనం పేర్కొంది. అదే సమయంలో ప్రజల ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలగకుండా, ప్రజా భద్రత, అత్యవసర సేవలకు ఆటంకం ఏర్పడకుండా చూడాలని స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయ ప్రదేశం గుర్తింపుపై న్యాయస్థానం చేసిన సూచనలను సంబంధిత అధికారులకు తెలియజేస్తానని కేంద్రం, ఢిల్లీ పోలీసుల తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.

ఈ పరిణామాల మధ్య, జంతర్ మంతర్ స్థానంలో కొత్త వేదికల ఎంపికతో ఢిల్లీలో నిరసనల నిర్వహణకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 October 2026, 3:03 pm Digital Edition : Prabhanews
Delhi Protest: ఢిల్లీలో నిరసనలకు కొత్త వేదికలు.. జంతర్ మంతర్‌లో ఇక ఆందోళనలు చేయలేరా? |

Last Updated:Oct 12, 2026 3:01 PM ISTదేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు నిర్వహించే విషయంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. దశాబ్దాలుగా రాజకీయ ఆందోళనలకు వేదికగా ఉన్న జంతర్ మంతర్‌ను అధికారిక నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగించారు. మరి, ఈ మార్పు ఎలాంటి ప్రభావం చూపనుంది?
News18దేశ రాజధాని ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు నిర్వహించే ప్రదేశాల విషయంలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఇప్పటివరకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు తమ ఆందోళనలు చేపట్టేందుకు ఉపయోగించిన జంతర్ మంతర్ ఇకపై అధికారిక నిరసన వేదికల జాబితాలో ఉండదు. ఢిల్లీ పోలీసులు తాజాగా జారీ చేసిన కొత్త ఉత్తర్వుల ప్రకారం, నిరసనల కోసం మూడు ప్రత్యామ్నాయ ప్రాంతాలను గుర్తించారు. కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.మూడు ప్రాంతాల్లో నిరసనలకు అవకాశంఢిల్లీ పోలీసుల స్టాండింగ్ ఆర్డర్ నంబర్ L&O/48/2026 ప్రకారం.. రామ్‌లీలా మైదాన్, బురారీ మైదాన్, తూర్పు ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్‌లను నిరసన ప్రదేశాలుగా ఎంపిక చేశారు. వీటిలో రామ్‌లీలా మైదాన్‌ మధ్య ఢిల్లీలో ఉండగా, బురారీ మైదాన్‌ ఉత్తర ఢిల్లీలో ఉంది. సీబీడీ గ్రౌండ్‌ తూర్పు ఢిల్లీలో ఉంది. ఈ మూడు ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించేందుకు అనుసరించాల్సిన విధివిధానాలు, నిబంధనలతో కూడిన ప్రత్యేక ప్రామాణిక నిర్వహణ మార్గదర్శకాలను (ఎస్‌వోపీలు) త్వరలో విడుదల చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ నిర్ణయం 2022 ఏప్రిల్ 28న జారీ చేసిన పాత స్టాండింగ్ ఆర్డర్‌కు పాక్షిక సవరణగా అమల్లోకి వచ్చింది. గతంలో జంతర్ మంతర్ రాజకీయ నిరసనలు, ప్రజా సమస్యలపై ఆందోళనలు, వివిధ సంఘాల ఉద్యమాలకు ప్రధాన కేంద్రంగా ఉండేది. తాజా మార్పుతో ఆ ప్రదేశం అధికారిక నిరసన వేదికల జాబితా నుంచి తొలగిపోయింది.సీజేపీ నిరసనకు అనుమతి వివాదంఎన్నికల సంఘం వ్యవహారాలు, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ప్రతిపక్షాలు నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కూడా ఇదే అంశాలపై జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహించేందుకు అనుమతి కోరింది.అక్టోబర్ 10న చేపట్టాలనుకున్న తమ నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారని సీజేపీ తెలిపింది. నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేయకపోవడమే ఇందుకు కారణమని పోలీసులు పేర్కొన్నారు. దీంతో సోమవారం సీజేపీ కార్యకర్తలు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిరసనకు అధికారిక అనుమతి ఇవ్వాలని కోరారు. తమ ఆందోళనకు సంబంధించిన తేదీ, సమయాన్ని 24 గంటల్లోగా తెలియజేయాలని పోలీసులకు గడువు విధించారు.సుప్రీంకోర్టు సూచనల నేపథ్యంలో నిర్ణయంనిరసన వేదికల మార్పునకు సుప్రీంకోర్టు చేసిన సూచనలు కూడా నేపథ్యంగా నిలిచాయి. అక్టోబర్ 9న ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, న్యాయమూర్తులు జాయ్‌మాల్య బాగ్చి, వి. మోహనాలతో కలిసి, జంతర్ మంతర్‌కు ప్రత్యామ్నాయంగా మెరుగైన సదుపాయాలున్న ప్రదేశాన్ని గుర్తించాలని కేంద్రం, ఢిల్లీ అధికారులకు సూచించింది.నిరసనల్లో పాల్గొనేవారికి తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య సదుపాయాలు వంటి కనీస వసతులు అందుబాటులో ఉండాలని ధర్మాసనం పేర్కొంది. అదే సమయంలో ప్రజల ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలగకుండా, ప్రజా భద్రత, అత్యవసర సేవలకు ఆటంకం ఏర్పడకుండా చూడాలని స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయ ప్రదేశం గుర్తింపుపై న్యాయస్థానం చేసిన సూచనలను సంబంధిత అధికారులకు తెలియజేస్తానని కేంద్రం, ఢిల్లీ పోలీసుల తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.ఈ పరిణామాల మధ్య, జంతర్ మంతర్ స్థానంలో కొత్త వేదికల ఎంపికతో ఢిల్లీలో నిరసనల నిర్వహణకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.మరింత చదవండి

Source link