Last Updated:
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాక’ సినిమా జనవరి 13, 2027న సంక్రాంతి కానుకగా విడుదలవుతుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ కొత్త లొకేషన్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాక’ సంక్రాంతి బరిలో నిలవడం ఖాయమైంది. అనుకున్న తేదీ ప్రకారం జనవరి 13, 2027న సినిమాను గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా స్పష్టం చేసింది. వాయిదా పడుతుందంటూ వస్తున్న పుకార్లను మేకర్స్ కొట్టిపారేశారు. ఈ ప్రకటనతో పాటు షూటింగ్ లొకేషన్ నుంచి కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. ఇందులో చిరంజీవి ‘కాక’ లుక్‌లో ఏదో విషయాన్ని తీవ్రంగా గమనిస్తున్నట్లు కనిపిస్తుండగా, దర్శకుడు బాబీ కొల్లి, రచయిత కోన వెంకట్ కూడా పక్కనే ఉన్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
విడుదల తేదీ ఖరారుతో పాటు సినిమాలోని తొలి పాట (ఫస్ట్ సింగిల్) అప్‌డేట్‌ను కూడా త్వరలోనే ఇవ్వనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, క్యారెక్టర్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
సంక్రాంతి పండుగ సమయంలో పెద్ద సినిమాల పోటీ మధ్య చిరంజీవి సినిమా వస్తుండటంతో మెగా అభిమానుల్లో జోష్ రెట్టింపైంది. బాబీ కొల్లి–చిరంజీవి కలయికపై భారీ అంచనాలు నెలకొనగా, ప్రమోషన్ల వేగాన్ని మేకర్స్ పెంచేందుకు సిద్ధమవుతున్నారు.

