రెండవది, మనకు అత్యంత దగ్గరైన వ్యక్తులు. కుటుంబ సభ్యులు, నిజమైన స్నేహితులు లేదా మనపై ప్రేమ, నమ్మకం ఉన్నవారు జీవితంలో గొప్ప సంపద. మంచి రోజుల్లో అందరూ మన చుట్టూ ఉంటారు. కానీ కష్టాలు వచ్చినప్పుడు మనతో పాటు నిలబడేది ఈ దగ్గరి వారే. వారి సహకారం, ప్రోత్సాహం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే ఇలాంటి వ్యక్తులతో మంచి సంబంధాలు కొనసాగించాలని, వారితో విభేదాలు పెట్టుకోవద్దని చాణక్యుడు సూచించారు. వారిని కోల్పోతే జీవితంలో ఒంటరితనం తప్పదని హెచ్చరించారు.

