ఈ ఎమోషనల్ మూమెంట్స్ తర్వాత హౌస్‌లో మళ్లీ ఆట వాతావరణం నెలకొంది. రెండో వారపు కెప్టెన్సీ టాస్క్‌ను బిగ్‌బాస్ ప్రకటించారు. పవర్ ఆఫ్ పీపుల్ గ్రూప్‌లో ఉన్న త్రిగుణ్, దేబ్జానీ, అమన్, షాలిని, ముఖేష్, రోహిత్, ఝాన్సీ, రాంప్రసాద్‌లు కెప్టెన్సీ రేసులో పోటీ పడ్డారు. వీరి కోసం బిగ్‌బాస్ ప్రత్యేకంగా బెలూన్ టాస్క్‌ను ఏర్పాటు చేశారు.

