HPCL–ఇన్స్టామార్ట్ సేవలో మరో ప్రత్యేకత ఏమిటంటే, వినియోగదారులు తప్పనిసరిగా ఇప్పటికే గృహ LPG కనెక్షన్ కలిగి ఉండాల్సిన అవసరం లేదు. అధికారిక గ్యాస్ కనెక్షన్ లేని విద్యార్థులు, ఉద్యోగస్తులు, అద్దె ఇళ్లలో నివసించే వారు, చిన్న కుటుంబాలు కూడా ఈ సేవను ఉపయోగించుకోవచ్చు. మొదటి ఆర్డర్ సమయంలో గుర్తింపు ధృవీకరణ, డెలివరీ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త సిలిండర్ అందిస్తారు. అనంతరం ఇచ్చే ఆర్డర్లను రీఫిల్గా పరిగణించి, ఖాళీ సిలిండర్ను డెలివరీ సమయంలో తిరిగి తీసుకుంటారు. HPCL తెలిపిన వివరాల ప్రకారం, HP నవ్య కాంపోజిట్ సిలిండర్ సంప్రదాయ స్టీల్ సిలిండర్లతో పోలిస్తే తేలికగా ఉండటంతో పాటు, తుప్పు పట్టదు. పారదర్శక బాడీ కారణంగా గ్యాస్ స్థాయిని సులభంగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా అపార్ట్మెంట్లలో నివసించే వారు, చిన్న కుటుంబాలు, అదనపు సిలిండర్ అవసరమయ్యే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని దీనిని రూపొందించారు. ప్రస్తుతం HPCL పంపిణీదారుల నెట్వర్క్ ద్వారానే ఈ సిలిండర్ల సరఫరా జరుగుతోంది.

