ప్రభన్యూస్

Bank Strike: బ్యాంక్ ఉద్యోగులకు, కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. దేశవ్యాప్త సమ్మె వాయిదా! | బిజినెస్


Last Updated:

Bank Strike: బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా పడింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మధ్య చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారాలు సెలవుపై కమిటీ ఏర్పాటు చేయనున్నారు.

News18
News18

Bank Strike: బ్యాంకు ఉద్యోగులు చేపట్టాలని నిర్ణయించిన సమ్మె, ఆందోళన కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) మధ్య ఆదివారం రాత్రి జరిగిన కీలక సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు UFBU 2026 సెప్టెంబర్ 27న విడుదల చేసిన సర్క్యులర్‌లో వివరాలను వెల్లడించింది. IBA, UFBU మధ్య రాత్రి 9.30 గంటలకు సమావేశం జరిగింది. చర్చల అనంతరం పలు అంశాలపై పరస్పర అవగాహనకు వచ్చినట్లు UFBU తెలిపింది. దీంతో ప్రతిపాదిత ఆందోళన కార్యక్రమాలు, సమ్మెను ప్రస్తుతానికి వాయిదా వేయాలని నిర్ణయించారు.

శనివారాలు సెలవుగా ప్రకటించే అంశంపై కమిటీ…

బ్యాంకులకు మిగిలిన శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించే అంశంపై IBA, UFBU కలిసి హై లెవల్ కమిటీని వెంటనే ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ సాధ్యమైన అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలించడంతో పాటు సంబంధిత వర్గాలు, బ్యాంకు ఉద్యోగులు, ముఖ్యంగా ఖాతాదారుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని పరిష్కార మార్గాలను చర్చించనుంది.

PL-I స్కీమ్‌పై కూడా చర్చలు…

Scale-IV, ఆపై స్థాయి అధికారులకు సంబంధించిన PL-I స్కీమ్ విషయంలో కూడా చర్చలు కొనసాగనున్నాయి. ఈ స్కీమ్‌లో మార్పులు చేయాలని ప్రభుత్వం, యూనియన్లు/అసోసియేషన్లతో చర్చించి ప్రతిపాదనలు రూపొందించే అంశంపై IBA చర్చలు ప్రారంభించనుంది.

పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు…

2024 మార్చి 8న జరిగిన సమావేశపు మినిట్స్‌లో పేర్కొన్న మిగిలిన అంశాలపై కూడా ఇరు వర్గాలు చర్చించి త్వరితగతిన పరిష్కారం కనుగొనాలని నిర్ణయించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో UFBU ప్రతిపాదించిన ఆందోళన కార్యక్రమాలు, బ్యాంకు సమ్మెను వాయిదా వేస్తున్నట్లు సర్క్యులర్‌లో స్పష్టం చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 September 2026, 11:44 pm Digital Edition : Prabhanews
Bank Strike: బ్యాంక్ ఉద్యోగులకు, కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. దేశవ్యాప్త సమ్మె వాయిదా! | బిజినెస్

Last Updated:Sep 27, 2026 11:37 PM ISTBank Strike: బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా పడింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మధ్య చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారాలు సెలవుపై కమిటీ ఏర్పాటు చేయనున్నారు.News18Bank Strike: బ్యాంకు ఉద్యోగులు చేపట్టాలని నిర్ణయించిన సమ్మె, ఆందోళన కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) మధ్య ఆదివారం రాత్రి జరిగిన కీలక సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు UFBU 2026 సెప్టెంబర్ 27న విడుదల చేసిన సర్క్యులర్‌లో వివరాలను వెల్లడించింది. IBA, UFBU మధ్య రాత్రి 9.30 గంటలకు సమావేశం జరిగింది. చర్చల అనంతరం పలు అంశాలపై పరస్పర అవగాహనకు వచ్చినట్లు UFBU తెలిపింది. దీంతో ప్రతిపాదిత ఆందోళన కార్యక్రమాలు, సమ్మెను ప్రస్తుతానికి వాయిదా వేయాలని నిర్ణయించారు.శనివారాలు సెలవుగా ప్రకటించే అంశంపై కమిటీ...బ్యాంకులకు మిగిలిన శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించే అంశంపై IBA, UFBU కలిసి హై లెవల్ కమిటీని వెంటనే ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ సాధ్యమైన అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలించడంతో పాటు సంబంధిత వర్గాలు, బ్యాంకు ఉద్యోగులు, ముఖ్యంగా ఖాతాదారుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని పరిష్కార మార్గాలను చర్చించనుంది.PL-I స్కీమ్‌పై కూడా చర్చలు...Scale-IV, ఆపై స్థాయి అధికారులకు సంబంధించిన PL-I స్కీమ్ విషయంలో కూడా చర్చలు కొనసాగనున్నాయి. ఈ స్కీమ్‌లో మార్పులు చేయాలని ప్రభుత్వం, యూనియన్లు/అసోసియేషన్లతో చర్చించి ప్రతిపాదనలు రూపొందించే అంశంపై IBA చర్చలు ప్రారంభించనుంది.పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు...2024 మార్చి 8న జరిగిన సమావేశపు మినిట్స్‌లో పేర్కొన్న మిగిలిన అంశాలపై కూడా ఇరు వర్గాలు చర్చించి త్వరితగతిన పరిష్కారం కనుగొనాలని నిర్ణయించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో UFBU ప్రతిపాదించిన ఆందోళన కార్యక్రమాలు, బ్యాంకు సమ్మెను వాయిదా వేస్తున్నట్లు సర్క్యులర్‌లో స్పష్టం చేసింది.మరింత చదవండి

Source link