దరఖాస్తు ఎలా చేసుకోవాలి?ఈ పథకం ప్రయోజనం పొందాలనుకునే రైతులు ఉద్యానవన శాఖ అధికారిక పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సమీప జిల్లా ఉద్యానవన శాఖ కార్యాలయాన్ని సందర్శించి అవసరమైన పత్రాలతో ఆఫ్లైన్లో కూడా దరఖాస్తు సమర్పించవచ్చు. దరఖాస్తు సమయంలో సాధారణంగా ఆధార్ కార్డు, భూ యాజమాన్య పత్రాలు, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్పోర్ట్ సైజు ఫోటో, ఇతర అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం స్థానిక ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించడం మంచిది.

