Allari Naresh: నవరాత్రి వేళ అమ్మవారికి తమన్ సంగీత నీరాజనం.. ‘అమ్మ కనకదుర్గ’ పాట వచ్చేసింది! | తెలుగు సినిమా వార్తలు
తమన్ ఎస్ సంగీతం అందించగా, సిరాశ్రీ సాహిత్యాన్ని సమకూర్చారు. కనకదుర్గ అమ్మవారి దివ్య కృప, శక్తి, ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని ఈ పాట ప్రతిబింబిస్తుంది. భక్తి, విశ్వాసం ప్రధానాంశాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్ర కథలోని అంతర్లీన భావాన్ని పాట ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేశారు. కనకదుర్గ అమ్మవారి ప్రసిద్ధ ఆలయం ఉన్న విజయవాడకు ఆధ్యాత్మికంగా విశేష ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా నవరాత్రులు, భవానీ దీక్షల సమయంలో లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. అలాంటి పవిత్ర నగరంలోనే ఈ…
