ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు, ట్యాబ్స్, స్మార్ట్‌వాచ్‌లు వంటి వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు, డీల్స్‌ను అందించనున్నారు. శామ్‌సంగ్, వన్‌ప్లస్, ఐకూ (iQOO), రెడ్‌మీ వంటి ప్రముఖ టెక్ బ్రాండ్‌లకు చెందిన మిడ్-రేంజ్, ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు తక్కువ ధరలకే లభించనున్నాయి. అంతేకాకుండా, పలు కొత్త స్మార్ట్‌ఫోన్ల లాంచ్‌లు కూడా ఈ సేల్‌లో ఉండనున్నాయి. అధునాతన కెమెరాలు, బ్రైట్ డిస్‌ప్లే, గేమింగ్ ఫీచర్లు, ఎక్కువ సేపు వచ్చే బ్యాటరీ లైఫ్ కలిగిన పాపులర్ ఫోన్లను భారీ డిస్కౌంట్లతో విక్రయించనున్నారు. Gadgets 360 కథనం ప్రకారం పలు వేటిపై ఆఫర్లు ఉంటాయో చూద్దాం.

