ప్రభన్యూస్

Aadhaar Card Update: ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవాలా? సెప్టెంబర్ 18 నుంచి కొత్త రూల్స్.. ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి! | బిజినెస్


Last Updated:

ఆధార్ కార్డులో పేరు చిన్నగా తప్పుగా నమోదైందా? పెళ్లి తర్వాత ఇంటిపేరు మార్చుకోవాలనుకుంటున్నారా? లేక పూర్తిగా కొత్త పేరు పెట్టుకోవాలనుకుంటున్నారా? అయితే అందరికీ ఒకే విధానం ఉండదని తెలుసా? UIDAI తీసుకొచ్చిన కొత్త నిబంధనల్లో పేరు మార్పులను వేర్వేరు కేటగిరీలుగా విభజించారు. పూర్తి వివరాలు తెలుసుకోండి.

Aadhaar
Aadhaar

ఆధార్ కార్డులో పేరు తప్పుగా నమోదైందా? పెళ్లి తర్వాత ఇంటిపేరు మార్చుకోవాలనుకుంటున్నారా? లేక పూర్తిగా పేరే మార్చాలనుకుంటున్నారా? ఇకపై అన్ని రకాల మార్పులకు ఒకే విధానం ఉండదు. మార్పు స్వభావాన్ని బట్టి అవసరమైన పత్రాలు, అఫిడవిట్, గెజిట్ నోటిఫికేషన్ సమర్పించాల్సి ఉంటుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) 2026లో సవరించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)లో ఈ వివరాలను స్పష్టంగా పేర్కొంది. ఈ కొత్త విధానం సెప్టెంబర్ 18, 2026 నుంచి అమల్లోకి వచ్చింది.

చిన్నపాటి మార్పులకు ప్రత్యేక నిబంధనలు

పేరులో స్వల్ప మార్పులను UIDAI ప్రత్యేక కేటగిరీగా పరిగణిస్తోంది. పేరులోని సంక్షిప్త రూపాన్ని పూర్తిగా రాయడం, మధ్య పేరు లేదా చివరి పేరును చేర్చడం లేదా తొలగించడం, పేర్ల క్రమాన్ని మార్చడం, ఉచ్చారణ పరంగా ఒకేలా ఉండే పేర్లలో చిన్న అక్షర దోషాలను సరిచేయడం ఇందులోకి వస్తాయి. ఉదాహరణకు ‘Tadi Rama Prasad’ అనే పేరును ‘Tadi Rama Shyam Prasad’గా మార్చడం కూడా ఈ కేటగిరీలో ఉంటుంది. పేరులోని చుక్కలను తొలగించడం, అనవసరంగా పెద్ద అక్షరాల్లో నమోదైన వాటిని సరిచేయడం కూడా స్వల్ప మార్పులుగానే పరిగణిస్తారు.

పెళ్లి, విడాకుల తర్వాత ఇంటిపేరు మార్పు

వివాహం లేదా విడాకుల కారణంగా ఇంటిపేరు మార్చుకోవాల్సి వస్తే, సవరించిన SOPలో దీనికి ప్రత్యేక నిబంధన ఉంది. ఇందుకోసం Annexure Dలో పేర్కొన్న అఫిడవిట్‌తో పాటు గుర్తింపు ధ్రువీకరణ పత్రం (PoI) సమర్పించాలి. పేరు మార్పు వివాహం లేదా విడాకుల కారణంగానే జరిగిందని, వ్యక్తి గుర్తింపులో ఎలాంటి మార్పు లేదని అఫిడవిట్‌లో పేర్కొనాలి.

ఆధార్‌లో నమోదైన పేరు తప్పుగా ఉంటే..

ఎన్‌రోల్‌మెంట్ లేదా గత అప్‌డేట్ సమయంలో సమర్పించిన పత్రంలో పేరు సరిగ్గా ఉన్నప్పటికీ, ఆధార్‌లో డేటా ఎంట్రీ సమయంలో తప్పుగా నమోదైతే దాన్ని డేటా ఎంట్రీ పొరపాటుగా పరిగణిస్తారు. పెద్దలకు Annexure B అఫిడవిట్‌తో పాటు PoI లేదా PoR అవసరం. మైనర్లకు Annexure Cలోని సంబంధిత అఫిడవిట్‌తో పాటు PoI లేదా PoR సమర్పించాలి. ఇంగ్లిష్‌లో పేరు సరిగ్గా ఉండి, ప్రాంతీయ భాషలో మాత్రం తప్పుగా నమోదైన సందర్భానికి కూడా ప్రత్యేక నిబంధన ఉంది.

పూర్తిగా పేరు మార్చాలంటే గెజిట్ తప్పనిసరి

పూర్తిగా పేరు మార్చడం లేదా వ్యక్తి గుర్తింపులో మార్పుగా పరిగణించే స్థాయిలో పేరు మార్చడం ‘Major Name Change’ కిందకు వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో పేరు మార్పుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ సమర్పించాల్సి ఉంటుంది.

అప్‌డేట్ ఎలా చేసుకోవాలి?

పేరు మార్పు కోసం ముందుగా మార్పు ఏ కేటగిరీలోకి వస్తుందో గుర్తించాలి. తర్వాత అవసరమైన PoI, PoR, అఫిడవిట్ లేదా గెజిట్ నోటిఫికేషన్ సిద్ధం చేసుకుని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్/అప్‌డేట్ కేంద్రాన్ని సందర్శించాలి. అక్కడ దరఖాస్తుతో పాటు పత్రాలు సమర్పించి ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేయాలి. అనంతరం లభించే రసీదును భద్రంగా ఉంచుకుని, అందులోని వివరాలతో అప్‌డేట్ స్థితిని తెలుసుకోవచ్చు. ప్రస్తుతం myAadhaar ద్వారా ఆన్‌లైన్‌లో పేరు మార్పు చేసే అవకాశం లేదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 October 2026, 8:40 pm Digital Edition : Prabhanews
Aadhaar Card Update: ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవాలా? సెప్టెంబర్ 18 నుంచి కొత్త రూల్స్.. ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి! | బిజినెస్

Last Updated:Oct 05, 2026 8:31 PM ISTఆధార్ కార్డులో పేరు చిన్నగా తప్పుగా నమోదైందా? పెళ్లి తర్వాత ఇంటిపేరు మార్చుకోవాలనుకుంటున్నారా? లేక పూర్తిగా కొత్త పేరు పెట్టుకోవాలనుకుంటున్నారా? అయితే అందరికీ ఒకే విధానం ఉండదని తెలుసా? UIDAI తీసుకొచ్చిన కొత్త నిబంధనల్లో పేరు మార్పులను వేర్వేరు కేటగిరీలుగా విభజించారు. పూర్తి వివరాలు తెలుసుకోండి.
Aadhaarఆధార్ కార్డులో పేరు తప్పుగా నమోదైందా? పెళ్లి తర్వాత ఇంటిపేరు మార్చుకోవాలనుకుంటున్నారా? లేక పూర్తిగా పేరే మార్చాలనుకుంటున్నారా? ఇకపై అన్ని రకాల మార్పులకు ఒకే విధానం ఉండదు. మార్పు స్వభావాన్ని బట్టి అవసరమైన పత్రాలు, అఫిడవిట్, గెజిట్ నోటిఫికేషన్ సమర్పించాల్సి ఉంటుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) 2026లో సవరించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)లో ఈ వివరాలను స్పష్టంగా పేర్కొంది. ఈ కొత్త విధానం సెప్టెంబర్ 18, 2026 నుంచి అమల్లోకి వచ్చింది.చిన్నపాటి మార్పులకు ప్రత్యేక నిబంధనలుపేరులో స్వల్ప మార్పులను UIDAI ప్రత్యేక కేటగిరీగా పరిగణిస్తోంది. పేరులోని సంక్షిప్త రూపాన్ని పూర్తిగా రాయడం, మధ్య పేరు లేదా చివరి పేరును చేర్చడం లేదా తొలగించడం, పేర్ల క్రమాన్ని మార్చడం, ఉచ్చారణ పరంగా ఒకేలా ఉండే పేర్లలో చిన్న అక్షర దోషాలను సరిచేయడం ఇందులోకి వస్తాయి. ఉదాహరణకు ‘Tadi Rama Prasad’ అనే పేరును ‘Tadi Rama Shyam Prasad’గా మార్చడం కూడా ఈ కేటగిరీలో ఉంటుంది. పేరులోని చుక్కలను తొలగించడం, అనవసరంగా పెద్ద అక్షరాల్లో నమోదైన వాటిని సరిచేయడం కూడా స్వల్ప మార్పులుగానే పరిగణిస్తారు.పెళ్లి, విడాకుల తర్వాత ఇంటిపేరు మార్పువివాహం లేదా విడాకుల కారణంగా ఇంటిపేరు మార్చుకోవాల్సి వస్తే, సవరించిన SOPలో దీనికి ప్రత్యేక నిబంధన ఉంది. ఇందుకోసం Annexure Dలో పేర్కొన్న అఫిడవిట్‌తో పాటు గుర్తింపు ధ్రువీకరణ పత్రం (PoI) సమర్పించాలి. పేరు మార్పు వివాహం లేదా విడాకుల కారణంగానే జరిగిందని, వ్యక్తి గుర్తింపులో ఎలాంటి మార్పు లేదని అఫిడవిట్‌లో పేర్కొనాలి.ఆధార్‌లో నమోదైన పేరు తప్పుగా ఉంటే..ఎన్‌రోల్‌మెంట్ లేదా గత అప్‌డేట్ సమయంలో సమర్పించిన పత్రంలో పేరు సరిగ్గా ఉన్నప్పటికీ, ఆధార్‌లో డేటా ఎంట్రీ సమయంలో తప్పుగా నమోదైతే దాన్ని డేటా ఎంట్రీ పొరపాటుగా పరిగణిస్తారు. పెద్దలకు Annexure B అఫిడవిట్‌తో పాటు PoI లేదా PoR అవసరం. మైనర్లకు Annexure Cలోని సంబంధిత అఫిడవిట్‌తో పాటు PoI లేదా PoR సమర్పించాలి. ఇంగ్లిష్‌లో పేరు సరిగ్గా ఉండి, ప్రాంతీయ భాషలో మాత్రం తప్పుగా నమోదైన సందర్భానికి కూడా ప్రత్యేక నిబంధన ఉంది.పూర్తిగా పేరు మార్చాలంటే గెజిట్ తప్పనిసరిపూర్తిగా పేరు మార్చడం లేదా వ్యక్తి గుర్తింపులో మార్పుగా పరిగణించే స్థాయిలో పేరు మార్చడం ‘Major Name Change’ కిందకు వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో పేరు మార్పుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ సమర్పించాల్సి ఉంటుంది.అప్‌డేట్ ఎలా చేసుకోవాలి?పేరు మార్పు కోసం ముందుగా మార్పు ఏ కేటగిరీలోకి వస్తుందో గుర్తించాలి. తర్వాత అవసరమైన PoI, PoR, అఫిడవిట్ లేదా గెజిట్ నోటిఫికేషన్ సిద్ధం చేసుకుని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్/అప్‌డేట్ కేంద్రాన్ని సందర్శించాలి. అక్కడ దరఖాస్తుతో పాటు పత్రాలు సమర్పించి ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేయాలి. అనంతరం లభించే రసీదును భద్రంగా ఉంచుకుని, అందులోని వివరాలతో అప్‌డేట్ స్థితిని తెలుసుకోవచ్చు. ప్రస్తుతం myAadhaar ద్వారా ఆన్‌లైన్‌లో పేరు మార్పు చేసే అవకాశం లేదు.మరింత చదవండి

Source link