Last Updated:
ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ఫేక్ డిస్కౌంట్లకు చెక్ పెట్టేలా కేంద్రం ఈ-కామర్స్ నిబంధనలను సవరించింది. ధరల్లో పారదర్శకత, నకిలీ ఆఫర్ల నియంత్రణే లక్ష్యంగా కొత్త రూల్స్ 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వినియోగదారుల రక్షణ కోసం ప్రభుత్వం ఈ అడుగు వేసింది.
అమెజాన్, మింత్రా, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఆన్‌లైన్ షాపింగ్ చేసే వినియోగదారుల కోసం కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. నకిలీ డిస్కౌంట్లు, మోసపూరిత ఆఫర్లకు అడ్డుకట్ట వేస్తూ వినియోగదారుల రక్షణ (ఈ-కామర్స్) నిబంధనలు 2020ని తాజాగా సవరించింది. ఆన్‌లైన్ వేదికలపై ధరలు చూపే విధానం, ప్రకటనలు, సెర్చ్ రిజల్ట్స్ తదితర అంశాల్లో పారదర్శకత పెంచేలా భారీ మార్పులు చేసింది. ఈ ‘వినియోగదారుల రక్షణ (ఈ-కామర్స్) (సవరణ) రూల్స్ 2026’ వచ్చే ఏడాది అనగా 2027 జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్నాయని న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది.

