కొత్త ఆల్ స్టార్స్ జావా 42కు మరింత బోల్డ్, స్పోర్టీ, మస్క్యులర్ లుక్ వచ్చింది. కొత్త స్టాన్స్, మారిన ప్రొపోర్షన్స్, రీడిజైన్ చేసిన రియర్ సెక్షన్, కొత్త అల్లాయ్ వీల్స్, సైడ్ ప్యానెల్, పైకి ఎత్తిన ఎగ్జాస్ట్ దీనికి కొత్త రూపాన్ని ఇచ్చాయి. నగరాల్లోనూ, హైవేలపైన కూడా బైక్‌ను సులభంగా నడిపేలా ఎర్గోనామిక్స్‌ను మెరుగుపరిచారు. శక్తివంతమైన జే-పాంథర్ ఇంజిన్‌పై దీన్ని నిర్మించారు. అయితే జావా బైక్‌కు ప్రత్యేకమైన డిజైన్ గుర్తులు మాత్రం అలాగే ఉన్నాయి. జావా ఆల్ స్టార్స్ కథ జావా రైడర్‌తో మొదలైంది. జావా రైడర్లు తమపై నమ్మకం ఉన్నవాళ్లు. తమకంటూ ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది. అదే సమయంలో తమలాంటి ఆలోచనలు, విలువలతో జీవించే వారితో బలమైన అనుబంధాన్ని కూడా కలిగి ఉంటారు. డిఫెన్స్ నుంచి స్పోర్ట్స్ వరకు ఉన్న కమ్యూనిటీల్లో కనిపించే క్రమశిక్షణ, నమ్మకం, స్నేహభావం, వ్యక్తిగత గౌరవం, పెద్ద లక్ష్యం కోసం కలిసి పనిచేయడం వంటి విలువలే దీనికి ఆధారం. జావా ఆల్ స్టార్స్ బైక్‌లపై ఉండే ప్రత్యేక ఇన్‌సిగ్నియా ఈ ఉమ్మడి విలువలకు గుర్తుగా నిలుస్తుంది. (image: jawayezdimotorcycles)

