Brutal Murders: రంగారెడ్డి జిల్లాలో దారుణం.. పోక్సో కేసు పెట్టారని.. ఆరుగురి హత్య.! | తెలంగాణ వార్తలు


Last Updated:

Brutal Murders: 28 ఏళ్ల రాజ్‌కుమార్.. తన భార్య, ఇద్దరు పిల్లలతోపాటూ.. బాధిత బాలిక, బాలిక తల్లి, బాలిక నాన్నమ్మను హత్య చేశాడు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో ఓ యువకుడు… ఆరుగురి హత్య చేశాడు. షాబాద్ మండలం, దైవాల గూడలో ఈ ఘోరం జరిగింది. పోక్సో కేసు పెట్టారన్న ఆగ్రహంతో రగిలిపోయిన 28 ఏళ్ల రాజ్‌కుమార్.. తన భార్య, ఇద్దరు పిల్లలతోపాటూ.. బాధిత బాలిక, బాలిక తల్లి, బాలిక నాన్నమ్మను హత్య చేశాడు. పదునైన కత్తితో.. అత్యంత దారుణంగా పొడిచి, నరికి చంపాడు. మొదట భార్య, పిల్లల్ని చంపి.. తర్వాత పోక్సో కేసులో బాధితురాలి ఇంటికి వెళ్లి.. బాలిక తల్లి, నాన్నమ్మను చంపాడు. తర్వాత బాలికను ఈడ్చుకుపోయి, ఊరి చివర చెరువు దగ్గర.. రేప్ చేసి చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

అర్థరాత్రి ఆరుగురి హత్యకు పాల్పడిన నిందితుడిపై అతని తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దాంతో పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు. ఘటనా స్థలికి వెళ్లిన సీపీ తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్.. ప్రొసీడింగ్స్ చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి: AP and Telangana Live News: విద్యార్థులకు అలర్ట్.. నేడు స్కూల్ సెలవు లేదు.!

ఓ బాలికపై అగత్యానికి పాల్పడిన రాజ్‌కుమార్‌పై కంప్లైంట్ ఇవ్వడంతో.. పోలీసులు పోక్సో కేసు నమోదుచేశారు. దాంతో.. బాధిత కుటుంబంతోపాటూ.. భార్య కూడా అతన్ని తీవ్రంగా వ్యతిరేకించిందని సమాచారం. మే 16న బాలిక తల్లి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు ఆ కేసులో అతన్ని అరెస్టు చేశాక.. ఎలాగొలా బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఆ తర్వాత రాజ్ కుమార్.. కక్షతో రగిలిపోయాడు. మృగంలా మారిపోయాడు. తననే జైలుకి పంపిస్తారా అనుకుంటూ.. కత్తితో కసా కసా నరికి, పొడిచి చంపాడు. దొరికిన వారిని దొరికినట్లు నరికేశాడు. ఈ విషయం తెలిసి స్థానికులు ఉలిక్కిపడ్డారు. రక్తపు మడుగులో ఉన్న మృతదేహాల్ని చూసి.. స్థానికులు షాక్ అయ్యారు. అంత దారుణంగా ఎలా చంపాడని వారు విషాదంలో మునిగిపోయారు. ఆరు హత్యల తర్వాత పోలీసులు అతన్ని పట్టుకున్నారు. కానీ ఆరుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

ఇవి కూడా చదవండి: AP and Telangana Weather Forecast Update: మళ్లీ ఎండాకాలం.. ఏపీ, తెలంగాణలో భగ్గుమనే వేడి.. ఉక్కపోత!

ఒకసారి కావాలనే నేరం చేసిన వారు.. మరిన్ని నేరాలు చేసే ప్రమాదం ఉంటుంది. అలాంటి వారిని పోలీసులు త్వరగా గుర్తించగలగాలి. వారిలో మానసిక స్థితి ఎలా ఉందో గుర్తించాలి. లేదంటే.. వారు.. ఇలాంటి ఘోరాలకు పాల్పడే పరిస్థితులు వస్తుంటాయి. గతంలోనూ ఇలాంటి చాలా ఘటనలు జరిగాయి. నేర కేసుల్లో చిక్కుకున్నవారు.. బెయిల్‌పై బయటకు వచ్చి.. హత్యలు చేసిన కేసులు చాలా ఉన్నాయి. అందువల్ల పోలీస్, న్యాయవ్యవస్థలు పటిష్టంగా ఉండాలి. నేరస్థుల విషయంలో కఠినంగా శిక్షలను అమలు చెయ్యాలి. ఈ కేసులో ఆరుగురు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. రాజ్‌కుమార్ ఆల్రెడీ జైల్లో ఉండి ఉంటే.. వారి ప్రాణాలు పోయేవి కావు. ఓ మృగం.. మనుషుల మధ్య తిరుగుతూ.. ఇంతటి అరాచకానికి పాల్పడింది. ఇది ఎవరి పాపం? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 11 July 2026, 7:03 am Digital Edition : Prabhanews
Brutal Murders: రంగారెడ్డి జిల్లాలో దారుణం.. పోక్సో కేసు పెట్టారని.. ఆరుగురి హత్య.! | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 11, 2026 5:58 AM ISTBrutal Murders: 28 ఏళ్ల రాజ్‌కుమార్.. తన భార్య, ఇద్దరు పిల్లలతోపాటూ.. బాధిత బాలిక, బాలిక తల్లి, బాలిక నాన్నమ్మను హత్య చేశాడు.ప్రతీకాత్మక చిత్రంరంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో ఓ యువకుడు... ఆరుగురి హత్య చేశాడు. షాబాద్ మండలం, దైవాల గూడలో ఈ ఘోరం జరిగింది. పోక్సో కేసు పెట్టారన్న ఆగ్రహంతో రగిలిపోయిన 28 ఏళ్ల రాజ్‌కుమార్.. తన భార్య, ఇద్దరు పిల్లలతోపాటూ.. బాధిత బాలిక, బాలిక తల్లి, బాలిక నాన్నమ్మను హత్య చేశాడు. పదునైన కత్తితో.. అత్యంత దారుణంగా పొడిచి, నరికి చంపాడు. మొదట భార్య, పిల్లల్ని చంపి.. తర్వాత పోక్సో కేసులో బాధితురాలి ఇంటికి వెళ్లి.. బాలిక తల్లి, నాన్నమ్మను చంపాడు. తర్వాత బాలికను ఈడ్చుకుపోయి, ఊరి చివర చెరువు దగ్గర.. రేప్ చేసి చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.అర్థరాత్రి ఆరుగురి హత్యకు పాల్పడిన నిందితుడిపై అతని తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దాంతో పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు. ఘటనా స్థలికి వెళ్లిన సీపీ తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్.. ప్రొసీడింగ్స్ చూస్తున్నారు.ఇవి కూడా చదవండి: AP and Telangana Live News: విద్యార్థులకు అలర్ట్.. నేడు స్కూల్ సెలవు లేదు.!ఓ బాలికపై అగత్యానికి పాల్పడిన రాజ్‌కుమార్‌పై కంప్లైంట్ ఇవ్వడంతో.. పోలీసులు పోక్సో కేసు నమోదుచేశారు. దాంతో.. బాధిత కుటుంబంతోపాటూ.. భార్య కూడా అతన్ని తీవ్రంగా వ్యతిరేకించిందని సమాచారం. మే 16న బాలిక తల్లి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు ఆ కేసులో అతన్ని అరెస్టు చేశాక.. ఎలాగొలా బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఆ తర్వాత రాజ్ కుమార్.. కక్షతో రగిలిపోయాడు. మృగంలా మారిపోయాడు. తననే జైలుకి పంపిస్తారా అనుకుంటూ.. కత్తితో కసా కసా నరికి, పొడిచి చంపాడు. దొరికిన వారిని దొరికినట్లు నరికేశాడు. ఈ విషయం తెలిసి స్థానికులు ఉలిక్కిపడ్డారు. రక్తపు మడుగులో ఉన్న మృతదేహాల్ని చూసి.. స్థానికులు షాక్ అయ్యారు. అంత దారుణంగా ఎలా చంపాడని వారు విషాదంలో మునిగిపోయారు. ఆరు హత్యల తర్వాత పోలీసులు అతన్ని పట్టుకున్నారు. కానీ ఆరుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.ఇవి కూడా చదవండి: AP and Telangana Weather Forecast Update: మళ్లీ ఎండాకాలం.. ఏపీ, తెలంగాణలో భగ్గుమనే వేడి.. ఉక్కపోత!ఒకసారి కావాలనే నేరం చేసిన వారు.. మరిన్ని నేరాలు చేసే ప్రమాదం ఉంటుంది. అలాంటి వారిని పోలీసులు త్వరగా గుర్తించగలగాలి. వారిలో మానసిక స్థితి ఎలా ఉందో గుర్తించాలి. లేదంటే.. వారు.. ఇలాంటి ఘోరాలకు పాల్పడే పరిస్థితులు వస్తుంటాయి. గతంలోనూ ఇలాంటి చాలా ఘటనలు జరిగాయి. నేర కేసుల్లో చిక్కుకున్నవారు.. బెయిల్‌పై బయటకు వచ్చి.. హత్యలు చేసిన కేసులు చాలా ఉన్నాయి. అందువల్ల పోలీస్, న్యాయవ్యవస్థలు పటిష్టంగా ఉండాలి. నేరస్థుల విషయంలో కఠినంగా శిక్షలను అమలు చెయ్యాలి. ఈ కేసులో ఆరుగురు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. రాజ్‌కుమార్ ఆల్రెడీ జైల్లో ఉండి ఉంటే.. వారి ప్రాణాలు పోయేవి కావు. ఓ మృగం.. మనుషుల మధ్య తిరుగుతూ.. ఇంతటి అరాచకానికి పాల్పడింది. ఇది ఎవరి పాపం? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link