ట్యాంక్ అమర్చిన 90 రోజుల తర్వాత నుంచి ఈ గోబర్ గ్యాస్‌ను పూర్తిస్థాయిలో వంటకు వాడుకోవచ్చు. ఒక్కసారి ఉత్పత్తి మొదలైతే సుమారు 20 కేజీల వరకు గ్యాస్ ఇందులో నిల్వ అవుతుంది. ఎలాంటి నిర్వహణ ఖర్చులు (జీరో మెయింటెనెన్స్) లేకుండా ఇది పనిచేస్తుంది. ఈ రూ.50 వేల ప్యాకేజీలో కంప్రెషర్ బూస్టర్, ఫిల్టర్, గ్యాస్ నిల్వ ఉండే బెలూన్, వంట కోసం ప్రత్యేక స్టవ్ లాంటి అన్ని విడిభాగాలు వస్తాయి. కరుణాకర్ బృందం ఇప్పటికే ఘట్‌కేసర్, యాచారం ప్రాంతాల్లో ఈ విధానాన్ని విజయవంతంగా ఏర్పాటు చేసి నిరూపించింది.
