Last Updated:
ప్రస్తుతం యువతలో బాగా ట్రెండ్ అవుతున్న ‘డెలులు’ అనే పదమే టైటిల్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘డెలులు’. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ వీడియో ఎంతో ఆసక్తికరంగా ఉంది.
ప్రస్తుతం యువతలో బాగా ట్రెండ్ అవుతున్న ‘డెలులు’ అనే పదమే టైటిల్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘డెలులు’. క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ బ్యానర్‌పై సంకీర్త్ కొండ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రీతం కస్తూరి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ రాజ్‌కుమార్ కథ, అదనపు సంభాషణలు అందించగా.. రెష్మిత్ ఎస్. కౌశిక స్క్రీన్‌ప్లే, సంభాషణలు రాశారు. టైటిల్ నుంచే విభిన్నంగా అనిపిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

