ప్రభన్యూస్

PM Modi Indonesia Visit 2026: ఇండొనేషియా పర్యటనలో ప్రధాని మోదీ.. రెండు దేశాల మధ్యా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం |


Last Updated:

PM Modi Indonesia Visit 2026: “2018లో మేము మా సంబంధాలను ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచాము, దీనివల్ల మా ప్రజలకు ప్రయోజనం చేకూరింది. ఈ పర్యటనలో, వివిధ రంగాలలో ఈ భాగస్వామ్యానికి మరింత ఊతమిచ్చే లక్ష్యంతో అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో, నేను చర్చలు జరుపుతాము” అని ప్రధాని మోదీ అన్నారు.

ఇండొనేషియా పర్యటనలో ప్రధాని మోదీ
ఇండొనేషియా పర్యటనలో ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ జులై 6న ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల పర్యటన కోసం ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు జులై 6న మోదీ ముందుగా ఆ దేశానికి బయలుదేరారు.

ఈ ప్లాన్‌లో భాగంగా.. ఇండొనేసియా ప్రభుత్వం ప్రధాని మోదీకి.. F16, సుఖోయ్ 30 యుద్ధ విమానాలతో స్వాగతం పలికింది. ఈ విమానాలు.. మోదీ ప్రయాణిస్తున్న విమానానికి పక్క నుంచి ప్రయాణించాయి. ఎస్కార్ట్ కల్పించాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చగా మారింది.

ఆ తర్వాత ప్రధాని మోదీ.. జకార్తాలో ల్యాండ్ అయ్యారు. ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో మోదీకి గ్రాండ్ స్వాగతం పలికారు. గార్డ్ ఆఫ్ ఆనర్ కూడా సమర్పించారు.

“2018లో మేము మా సంబంధాలను ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచాము, దీనివల్ల మా ప్రజలకు ప్రయోజనం చేకూరింది. ఈ పర్యటనలో, వివిధ రంగాలలో ఈ భాగస్వామ్యానికి మరింత ఊతమిచ్చే లక్ష్యంతో అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో, నేను చర్చలు జరుపుతాము” అని ప్రధాని మోదీ అన్నారు. ఈ చర్చల్లో రక్షణ, వాణిజ్యం, మెరైన్ సెక్యూరిటీ, ఎనర్జీ, కనెక్టివిటీ, టెక్నాలజీ, పీపుల్-టు-పీపుల్ సంబంధాల వంటి అంశాలపై చర్చిస్తారు.

“అధ్యక్షుడు ప్రబోవో, నేను యోగ్యకర్తలోని ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తాము. ఇది మన దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాల్ని మరింత బలోపేతం చేస్తుంది. ఇండోనేషియా పర్యటనలో భారతీయ సమాజంతో మమేకమయ్యేందుకు కూడా నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని ఆయన అన్నారు. జకార్తా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (JICC)లో ప్రవాస భారతీయులతో ఈ సమావేశం జరగనుంది. అధ్యక్షుడు ప్రబోవో కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. భారతీయ సంస్కృతి, సంగీత ప్రదర్శనలు జరుగుతాయి.

సాంస్కృతిక సహకారం భాగంగా యోగ్యకర్తలోని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన 9వ శతాబ్దపు ప్రాంబనాన్ ఆలయ సముదాయం (Prambanan Temple) పునరుద్ధరణలో భారత్ సహకరిస్తోంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఇండోనేషియా అధికారులతో కలిసి పని చేస్తోంది. జులై 8న మోదీ ఈ ఆలయాన్ని సందర్శించనున్నారు.

ఇవి కూడా చదవండి: Astrology: బుధుడి తిరోగమనం, వరుణ వక్రీభవనం.. 12 రాశులపై ప్రభావం.. ధన యోగం, భ్రమలు, ఆధ్యాత్మికం

ఇండోనేషియా-భారత్ సంబంధాలు చాలా పురాతనమైనవి. రవీంద్రనాథ్ టాగోర్ 1927లో ఇండోనేషియా సందర్శన 100వ వార్షికోత్సవం సందర్భంగా మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయడానికి భారత్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇండోనేషియా మార్చిలో ప్రకటించింది. 2022లో దాదాపు 375 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా, బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసిన మొదటి విదేశీ దేశంగా ఫిలిప్పీన్స్ నిలిచింది.

ఇవి కూడా చదవండి: Post Office RD: పోస్టాఫీస్ RDలో నెలకు రూ.2,000 జమ చేస్తే, 5 ఏళ్ల తర్వాత ఎంత వస్తుంది?

ప్రధాని మోదీ ఈ పర్యటన ద్వారా భారత్ యొక్క ఇండో-పసిఫిక్ వ్యూహాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. ఆస్ట్రేలియా (జులై 8-10), న్యూజిలాండ్ (జులై 10-11)లో కూడా ఇలాంటి ద్వైపాక్షిక చర్చలు, వ్యాపార నాయకులతో సమావేశాలు, ప్రవాస భారతీయులతో కార్యక్రమాలు జరుగనున్నాయి. ఇది భారత్ ఈస్టర్న్ ఇండియన్ ఓష, సదరన్ ఇండియన్ ఓషన్ సంబంధాలను మరింత దృఢం చేస్తుంది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 July 2026, 7:05 am Digital Edition : Prabhanews
PM Modi Indonesia Visit 2026: ఇండొనేషియా పర్యటనలో ప్రధాని మోదీ.. రెండు దేశాల మధ్యా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం |

Last Updated:Jul 07, 2026 6:47 AM ISTPM Modi Indonesia Visit 2026: "2018లో మేము మా సంబంధాలను 'సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి పెంచాము, దీనివల్ల మా ప్రజలకు ప్రయోజనం చేకూరింది. ఈ పర్యటనలో, వివిధ రంగాలలో ఈ భాగస్వామ్యానికి మరింత ఊతమిచ్చే లక్ష్యంతో అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో, నేను చర్చలు జరుపుతాము" అని ప్రధాని మోదీ అన్నారు. ఇండొనేషియా పర్యటనలో ప్రధాని మోదీప్రధాని నరేంద్ర మోదీ జులై 6న ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల పర్యటన కోసం ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు జులై 6న మోదీ ముందుగా ఆ దేశానికి బయలుదేరారు.ఈ ప్లాన్‌లో భాగంగా.. ఇండొనేసియా ప్రభుత్వం ప్రధాని మోదీకి.. F16, సుఖోయ్ 30 యుద్ధ విమానాలతో స్వాగతం పలికింది. ఈ విమానాలు.. మోదీ ప్రయాణిస్తున్న విమానానికి పక్క నుంచి ప్రయాణించాయి. ఎస్కార్ట్ కల్పించాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చగా మారింది.ఆ తర్వాత ప్రధాని మోదీ.. జకార్తాలో ల్యాండ్ అయ్యారు. ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో మోదీకి గ్రాండ్ స్వాగతం పలికారు. గార్డ్ ఆఫ్ ఆనర్ కూడా సమర్పించారు.
Tiba di Jakarta. Saya sangat tersentuh oleh kehangatan Presiden Prabowo Subianto yang telah menyambut saya langsung di bandara.Pada tahun 2018, kami meningkatkan hubungan kedua negara menjadi Kemitraan Strategis Komprehensif, yang telah membawa banyak manfaat bagi masyarakat… pic.twitter.com/aWRYl0RzJf
— Narendra Modi (@narendramodi) July 6, 2026"2018లో మేము మా సంబంధాలను 'సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి పెంచాము, దీనివల్ల మా ప్రజలకు ప్రయోజనం చేకూరింది. ఈ పర్యటనలో, వివిధ రంగాలలో ఈ భాగస్వామ్యానికి మరింత ఊతమిచ్చే లక్ష్యంతో అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో, నేను చర్చలు జరుపుతాము" అని ప్రధాని మోదీ అన్నారు. ఈ చర్చల్లో రక్షణ, వాణిజ్యం, మెరైన్ సెక్యూరిటీ, ఎనర్జీ, కనెక్టివిటీ, టెక్నాలజీ, పీపుల్-టు-పీపుల్ సంబంధాల వంటి అంశాలపై చర్చిస్తారు.
The performance of ‘Homage to the Triple Gem’, by the artistes of the Vihara Dharma Ratna Group, was exceptional. It reflected the timeless teachings of Lord Buddha and the profound values embodied in the Triple Gem. It is heartening to see the rich Buddhist heritage being… pic.twitter.com/4KAP3rnXGT
— Narendra Modi (@narendramodi) July 6, 2026"అధ్యక్షుడు ప్రబోవో, నేను యోగ్యకర్తలోని ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తాము. ఇది మన దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాల్ని మరింత బలోపేతం చేస్తుంది. ఇండోనేషియా పర్యటనలో భారతీయ సమాజంతో మమేకమయ్యేందుకు కూడా నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని ఆయన అన్నారు. జకార్తా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (JICC)లో ప్రవాస భారతీయులతో ఈ సమావేశం జరగనుంది. అధ్యక్షుడు ప్రబోవో కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. భారతీయ సంస్కృతి, సంగీత ప్రదర్శనలు జరుగుతాయి.
Witnessed a captivating performance of Wayang Kulit, Indonesia’s treasured shadow puppetry tradition, bringing the timeless story of the Ramayan to life. It was a moving reminder of how our shared civilisational heritage has travelled across seas and generations, taking on… pic.twitter.com/wmEW3QTcUT
— Narendra Modi (@narendramodi) July 6, 2026సాంస్కృతిక సహకారం భాగంగా యోగ్యకర్తలోని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన 9వ శతాబ్దపు ప్రాంబనాన్ ఆలయ సముదాయం (Prambanan Temple) పునరుద్ధరణలో భారత్ సహకరిస్తోంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఇండోనేషియా అధికారులతో కలిసి పని చేస్తోంది. జులై 8న మోదీ ఈ ఆలయాన్ని సందర్శించనున్నారు.ఇవి కూడా చదవండి: Astrology: బుధుడి తిరోగమనం, వరుణ వక్రీభవనం.. 12 రాశులపై ప్రభావం.. ధన యోగం, భ్రమలు, ఆధ్యాత్మికంఇండోనేషియా-భారత్ సంబంధాలు చాలా పురాతనమైనవి. రవీంద్రనాథ్ టాగోర్ 1927లో ఇండోనేషియా సందర్శన 100వ వార్షికోత్సవం సందర్భంగా మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయడానికి భారత్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇండోనేషియా మార్చిలో ప్రకటించింది. 2022లో దాదాపు 375 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా, బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసిన మొదటి విదేశీ దేశంగా ఫిలిప్పీన్స్ నిలిచింది.ఇవి కూడా చదవండి: Post Office RD: పోస్టాఫీస్ RDలో నెలకు రూ.2,000 జమ చేస్తే, 5 ఏళ్ల తర్వాత ఎంత వస్తుంది?ప్రధాని మోదీ ఈ పర్యటన ద్వారా భారత్ యొక్క ఇండో-పసిఫిక్ వ్యూహాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. ఆస్ట్రేలియా (జులై 8-10), న్యూజిలాండ్ (జులై 10-11)లో కూడా ఇలాంటి ద్వైపాక్షిక చర్చలు, వ్యాపార నాయకులతో సమావేశాలు, ప్రవాస భారతీయులతో కార్యక్రమాలు జరుగనున్నాయి. ఇది భారత్ ఈస్టర్న్ ఇండియన్ ఓష, సదరన్ ఇండియన్ ఓషన్ సంబంధాలను మరింత దృఢం చేస్తుంది.Click here to add News18 as your preferred news source on Google. బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link