Last Updated:
హైదరాబాద్‌లో బైక్ ట్యాక్సీల భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇకపై ఎల్లో నంబర్ ప్లేట్ తప్పనిసరి చేస్తే డ్రైవర్లపై ఎలాంటి భారం పడుతుంది? అసలు కొత్త రూల్స్ ఎలా ఉండబోతున్నాయి? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
Bike Taxi Rules: హైదరాబాద్‌లో బైక్ ట్యాక్సీలు, ఆటోల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం వ్యక్తిగత ద్విచక్ర వాహనాలతో బైక్ ట్యాక్సీ సేవలు అందిస్తున్న వారికి కొత్త నిబంధనలు తీసుకురావాలని రవాణాశాఖ భావిస్తోంది. అదే సమయంలో 2012 తర్వాత పెరగని ఆటోరిక్షా ఛార్జీలను సవరించేందుకు కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ అంశాలకు సంబంధించిన వివరాలను రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల బస్‌భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

