Last Updated:
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా చిరంజీవి పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, మరోవైపు రాజకీయ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు వెల్లువలా కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కేవలం ఒక అన్నగా మాత్రమే కాకుండా, పవన్ చేస్తున్న సేవలను చూసి గర్వపడుతున్న ఒక పౌరుడిగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

