చాలా ఇళ్లలో బియ్యం ప్రధాన ఆహారంగా ఉపయోగిస్తారు. అన్నం, ఖిచ్డీ, ఫ్రైడ్ రైస్, బిర్యానీ వంటి ఎన్నో వంటకాల్లో బియ్యం తప్పనిసరిగా ఉంటుంది. అందుకే చాలా మంది ఒకేసారి 5 నుంచి 10 కిలోల వరకు బియ్యం కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటారు. అయితే వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల బియ్యంలో పురుగులు, గొంగళి పురుగులు (వీవిల్స్) పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో బియ్యం రుచి, నాణ్యత రెండూ దెబ్బతింటాయి. అయితే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు పాటిస్తే బియ్యాన్ని చాలా రోజుల పాటు తాజాగా, పురుగులు పట్టకుండా భద్రంగా నిల్వ ఉంచుకోవచ్చు.

