రవితేజ తమ్ముడు రఘు రాజు కొడుకు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మారెమ్మ’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. పక్కా మాస్ విలేజ్ రూరల్ బ్యాక్ డ్రాప్తో ఈ సినిమా తెరకెక్కింది. మారెమ్మ తల్లి ప్రతిరూపంగా భావించే పవిత్రమైన ఒక దున్నపోతు చుట్టూ ఈ సినిమా కథ సాగుతున్నట్లు తెలుస్తుంది. దైవంగా కొలిచే మారెమ్మ అనుకోకుండా కనిపించకుండా పోతుంది. అసలు మారెమ్మ ఎక్కడికి వెళ్ళింది? అనే క్యూరియాసిటితో ట్రైలర్ను కట్ చేశారు. మంచాల నాగరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 10న విడుదల కాబోతుంది.
Source link
Maremma Movie: గూస్బంప్స్ తెప్పిస్తున్న 'మారెమ్మ' ట్రైలర్.. రవితేజ తమ్ముడి కొడుకు ఇరగ్గొట్టేశాడుగా!
