Last Updated:
భారతదేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఒక కీలకమైన పిలుపు, దేశీయ స్టాక్ మార్కెట్లపై తక్షణ ప్రభావాన్ని చూపించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు అనవసరంగా బంగారాన్ని కొనుగోలు చేయవద్దని ఆయన చేసిన విజ్ఞప్తి కొన్ని గంటల్లోనే మార్కెట్లలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది.
భారతదేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఒక కీలకమైన పిలుపు, దేశీయ స్టాక్ మార్కెట్లపై తక్షణ ప్రభావాన్ని చూపించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు అనవసరంగా బంగారాన్ని కొనుగోలు చేయవద్దని ఆయన చేసిన విజ్ఞప్తి కొన్ని గంటల్లోనే మార్కెట్లలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. మంగళవారం (సెప్టెంబర్ 1వ తేదీన) స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే, లాభాల స్వీకరణ (ప్రాఫిట్ బుకింగ్), బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంతో దేశంలోని ప్రముఖ ఆభరణాల తయారీ, విక్రయ కంపెనీల షేర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ప్రధాని మాటల ప్రభావం మదుపరుల సెంటిమెంట్‌పై ఎంత బలంగా ఉందో ఈ పరిణామం స్పష్టం చేస్తోంది.

