సినిమాల్లో పాటలు అసందర్భం అనుకునే వాళ్లకు అది అబద్దమని నిరూపించడానికి ఇరుముడి మూవీ ఉదాహరణగా చెప్పవచ్చు. సందర్భాన్ని బట్టి ఎలాంటి పాటలు పెడితే ఆ పాటే సినిమాను హిట్ చేస్తుందనడానికి ఇరుముడిలోని మల్లెపూల పల్లకి’ పాట బెస్ట్ ఎగ్జామ్పుల్. థియేటర్లలో పూజల్లో,చివరకు సక్సెస్ మీట్లో కూడా ఇప్పుడు ఈ పాటకే హీరోలు, ఆడియన్స్, రవితేజ ఫ్యాన్స్, అయ్యప్ప భక్తులు స్టెప్పులు వేస్తున్నారు. థియేటర్లలో సాంగ్ వచ్చినప్పుడు హారతులు ఇస్తున్నారంటే సాంగ్ క్రేజ్ ఏ రేంజ్కి చేరిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.(Photo: Facebook)
