Last Updated:
Jio Platforms IPO: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు కీలకమైన ముందడుగు పడింది. సుమారు రూ.37,700 కోట్ల భారీ పబ్లిక్ ఇష్యూకు సెబీ ఆమోదం లభించింది. ఈ ఐపీఓ విజయవంతమైతే భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలిచే అవకాశం ఉంది. 2008 తర్వాత రిలయన్స్ గ్రూప్ నుంచి రానున్న తొలి ఐపీఓ కావడంతో ఇన్వెస్టర్లలోనూ భారీ ఆసక్తి నెలకొంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్ సేవల విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ త్వరలో స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO)కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఆమోదం లభించింది. ప్రతిపాదిత ఐపీఓ ద్వారా సుమారు 4 బిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ.37,700 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ అంచనా ప్రకారం ఐపీఓ పూర్తయితే, ఇది భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలిచే అవకాశం ఉంది.

