గతంలో ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబును బర్గర్, పేస్ట్రీ, పెరుగన్నం.. ఈ మూడింటిలో ఏది ఇష్టం అని అడిగితే.. “నేను వీటిలో ఏదీ తినను. చాలా కాలంగా డెయిరీ (పాలు, పెరుగు ఉత్పత్తులు), బ్రెడ్ పూర్తిగా మానేశాను. అప్పుడప్పుడు చాలా అరుదుగా స్వీట్ మాత్రమే తింటాను” అని చెప్పారు. కేవలం పీచు పదార్థాలు (ఫైబర్) ఎక్కువగా ఉండే కూరగాయలు, క్లీన్ ప్రోటీన్ మాత్రమే ఆయన డైట్‌లో భాగం చేసుకున్నారు.
