ప్రపంచంలోని నదులు ఎప్పటికీ ఒకే మార్గంలో ప్రవహించవు. భూకదలికలు, వాతావరణ మార్పులు, క్రమక్షయం, వరదలు వంటి సహజ ప్రక్రియల కారణంగా కాలక్రమేణా వాటి ప్రవాహ మార్గాలు మారుతుంటాయి. కొన్ని నదులు పూర్తిగా ఎండిపోతే, మరికొన్ని పూడిపోయి కొత్త మార్గాల్లో ప్రవహిస్తాయి. అందుకే ప్రపంచంలోనే అత్యంత పురాతన నది ఏదో ఖచ్చితంగా చెప్పడం అంత సులభం కాదు. అయినప్పటికీ ఆస్ట్రేలియాలోని ఫింకే నది ప్రపంచంలోని అత్యంత పురాతన నదీ వ్యవస్థల్లో ఒకటిగా, తరచుగా ప్రపంచంలోనే పురాతన నదిగా పేర్కొంటారు.

