ప్రభుత్వ రంగ బ్యాంకులు అందిస్తున్న ఈ 444 రోజుల ప్రత్యేక డిపాజిట్ పథకం కాలపరిమితి సుమారు 14.5 నెలలు ఉంటుంది. అంటే స్వల్ప కాలంలోనే మంచి రాబడిని ఆశించే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే, సాధారణంగా ఒక సంవత్సరం లేదా 2 సంవత్సరాల కాలపరిమితి ఉన్న డిపాజిట్లతో పోలిస్తే, ఈ 444 రోజుల పథకాలపై బ్యాంకులు అదనపు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. లైవ్ మింట్ ప్రచురించిన తాజా రిపోర్టు ప్రకారం, ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ దగ్గర ద్రవ్య లభ్యతను పెంచుకోవడానికీ, ప్రైవేట్ బ్యాంకులతో గట్టిగా పోటీ పడటానికి ఇటువంటి ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఈ నివేదిక ఆధారంగా చూస్తే, రూ.5 లక్షల మొత్తాన్ని ఒకేసారి ఈ ప్రత్యేక డిపాజిట్లలో సేవ్ చేయడం ద్వారా, మెచ్యూరిటీ సమయానికి ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తాన్ని ఖాతాదారులు సొంతం చేసుకోవచ్చు. పెట్టుబడికి పూర్తి ప్రభుత్వ భద్రత ఉండటంతో పాటు, అత్యధిక వడ్డీ రేట్లు ఉండటం వల్ల ఈ స్కీమ్ సాధారణ పౌరులకు ఎంతో ప్రయోజనకరంగా మారింది.
