అయితే పరుగెత్తుతున్న సమయంలో శరీరం ఇచ్చే సంకేతాలను గమనించడం అన్నింటికంటే ముఖ్యమని డాక్టర్ చెబుతున్నారు. తల తిరగడం, తీవ్రమైన ఆయాసం, ఛాతీలో నొప్పి లేదా ఒత్తిడి, అసాధారణమైన బలహీనత, వికారం, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరుగును ఆపాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఛాతీ నొప్పి, తీవ్రమైన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా స్పృహ కోల్పోయే పరిస్థితి ఎదురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్య సహాయం తీసుకోవాలని చెబుతున్నారు. చిన్న అసౌకర్యంగా భావించి అదే స్థాయిలో వ్యాయామాన్ని కొనసాగించడం ప్రమాదకరంగా మారవచ్చని వివరిస్తున్నారు.
