ప్రభన్యూస్

Sowcar Janaki Funeral: దక్షిణాది చిత్ర పరిశ్రమలో విషాదం.. నేడు చెన్నైలో ప్రముఖ నటి షావుకారు జానకి అంత్యక్రియలు | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

Sowcar Janaki Funeral: షావుకారు జానకి అసలు పేరు శంకరామంచి జానకి. ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చెందిన ఒక కన్నడ మాట్లాడే కుటుంబంలో జన్మించారు. 1950లో ‘షావుకారు’ అనే తెలుగు చిత్రంతో ఆమె సినీరంగ ప్రవేశం చేశారు. ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో అప్పటినుంచి ఆమె పేరు ‘షావుకారు జానకి’గా స్థిరపడిపోయింది.

దక్షిణాది చిత్ర పరిశ్రమలో విషాదం (Image - x - @RohiSRH)
దక్షిణాది చిత్ర పరిశ్రమలో విషాదం (Image – x – @RohiSRH)

దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో అత్యంత గౌరవనీయమైన, సుదీర్ఘ కాలం పాటు తన విశేషమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి (94) మరణం అందర్నీ కలచివేస్తోంది. వయోభారంతో పాటు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె నిన్న శుక్రవారం నాడు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఇండియా టుడే రిపోర్టు ప్రకారం, ఆమె మరణవార్త యావత్ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. వయసు పైబడటం వల్ల తలెత్తిన కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా ఆమెను చెన్నై ఆల్వార్‌పేటలోని కావేరి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు ఆమెకు ఇంటెన్సివ్ కేర్ విభాగంలో అత్యవసర చికిత్స అందించారు. అయినప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఆమె కన్నుమూశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 August 2026, 9:05 am Digital Edition : Prabhanews
Sowcar Janaki Funeral: దక్షిణాది చిత్ర పరిశ్రమలో విషాదం.. నేడు చెన్నైలో ప్రముఖ నటి షావుకారు జానకి అంత్యక్రియలు | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 22, 2026 8:57 AM ISTSowcar Janaki Funeral: షావుకారు జానకి అసలు పేరు శంకరామంచి జానకి. ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చెందిన ఒక కన్నడ మాట్లాడే కుటుంబంలో జన్మించారు. 1950లో 'షావుకారు' అనే తెలుగు చిత్రంతో ఆమె సినీరంగ ప్రవేశం చేశారు. ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో అప్పటినుంచి ఆమె పేరు 'షావుకారు జానకి'గా స్థిరపడిపోయింది.దక్షిణాది చిత్ర పరిశ్రమలో విషాదం (Image - x - @RohiSRH)దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో అత్యంత గౌరవనీయమైన, సుదీర్ఘ కాలం పాటు తన విశేషమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి (94) మరణం అందర్నీ కలచివేస్తోంది. వయోభారంతో పాటు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె నిన్న శుక్రవారం నాడు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఇండియా టుడే రిపోర్టు ప్రకారం, ఆమె మరణవార్త యావత్ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. వయసు పైబడటం వల్ల తలెత్తిన కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా ఆమెను చెన్నై ఆల్వార్‌పేటలోని కావేరి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు ఆమెకు ఇంటెన్సివ్ కేర్ విభాగంలో అత్యవసర చికిత్స అందించారు. అయినప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఆమె కన్నుమూశారు.మరింత చదవండి

Source link