Last Updated:
మూత్ర నాళాల ఇన్ఫెక్షన్‌ను UTI (Urinary Tract Infection) అంటారు. ఇది పురుషులు, మహిళలు ఇద్దరికీ రావచ్చు. అయితే మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలేంటో తెలుసుకోండి
మూత్ర నాళాల ఇన్ఫెక్షన్‌ను UTI (Urinary Tract Infection) అంటారు. ఇది పురుషులు, మహిళలు ఇద్దరికీ రావచ్చు. అయితే మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి మహిళల్లో మూత్రనాళం పొడవు తక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియా మూత్రాశయానికి సులభంగా చేరుకోవడం. గర్భధారణ, మెనోపాజ్, కొన్ని గర్భనిరోధక పద్ధతులు, మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం వంటి కారణాలు కూడా UTI వచ్చే అవకాశాన్ని పెంచవచ్చని మెడికవర్ గైనకాలజిస్ట్ డాక్టర్ రషు తేజశ్విని, న్యూస్18 తెలుగుతో అన్నారు.

