Last Updated:
Unlisted Shares: NSE, BSEలో లిస్టైన షేర్లతో పాటు అన్‌లిస్టెడ్, ప్రీ-ఐపీఓ షేర్లపై కూడా ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతోంది. భవిష్యత్తులో ఐపీఓకు వచ్చే అవకాశం ఉన్న కంపెనీల్లో ముందుగానే పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇవి ఒక అవకాశంగా కనిపిస్తున్నాయి. అయితే లిస్టెడ్ షేర్లతో పోలిస్తే అన్‌లిస్టెడ్ షేర్ల కొనుగోలు విధానం, ధర నిర్ణయం, లిక్విడిటీ, రిస్క్‌లు భిన్నంగా ఉంటాయి. అసలు అన్‌లిస్టెడ్ షేర్లు అంటే ఏంటి? వాటిని ఎలా కొనాలి? పెట్టుబడి పెట్టే ముందు ఎలాంటి విషయాలను తప్పనిసరిగా పరిశీలించాలి? తెలుసుకుందాం.
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారు సాధారణంగా NSE, BSEలో లిస్టైన కంపెనీల షేర్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు వీటికి భిన్నంగా అన్‌లిస్టెడ్ షేర్లపై కూడా కొంతమంది ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. భవిష్యత్తులో ఐపీఓకు వచ్చే అవకాశం ఉన్న కంపెనీల్లో ముందుగానే పెట్టుబడి పెట్టాలని భావించే వారు ఈ షేర్లను పరిశీలిస్తున్నారు. అయితే అన్‌లిస్టెడ్ షేర్లలో పెట్టుబడి పెట్టే విధానం, రిస్క్‌లు సాధారణ లిస్టెడ్ షేర్లతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి.

