డయాబెటిస్ పేషెంట్లు ధైర్యంగా తినగలిగే ఆ 5 పవర్ ఫుల్ ఆహారాలు.. 1. ఆకుకూరలు – పాలకూర, మెంతికూర … డయాబెటిస్ ఉన్నవారికి ఆకుకూరలు అత్యంత సురక్షితమైన ఆహారమని డాక్టర్ బి కార్తీక్ రావు తెలిపారు. పాలకూర, తోటకూర, మెంతికూర, బచ్చలికూర వంటి వాటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. వీటిలో ఉండే అధిక ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదింపజేసి రక్తంలో చక్కెర స్థాయిలను ఎప్పుడూ స్థిరంగా ఉంచుతుంది. వీటిని ఎంత తిన్నా బరువు లేదా షుగర్ పెరిగే ముప్పు ఉండదు.
