యువతకు, తల్లిదండ్రులకు హెచ్చరిక: “ఈ రోజుల్లో ఫోన్ చాలా ముఖ్యమే. కానీ, అవసరానికి మించి వాడితే మాత్రం నా పరిస్థితే వస్తుంది. పనికిమాలిన వీడియోలు చూస్తూ సమయం వృథా చేసుకోవద్దు. దీని వల్ల డబ్బులు ఖర్చు కావడమే కాకుండా, మాటల్లో చెప్పలేని నరకయాతన అనుభవించాల్సి వస్తుంది” అని షకీల హెచ్చరించారు. ముఖ్యంగా చిన్న పిల్లల చేతికి ఫోన్ ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ వాడకాన్ని వీలైనంత తగ్గించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
