Last Updated:
SBI Scheme | ఒక్కసారిగా పెద్ద మొత్తం పెట్టుబడి పెట్టకుండానే రూ.1 లక్ష పొదుపు చేయాలనుకునేవారికి ఎస్‌బీఐ హర్ ఘర్ లఖ్‌పతి స్కీమ్ ఉపయోగపడొచ్చు. ప్రతి నెలా కొంత మొత్తాన్ని జమ చేస్తూ మీ పొదుపు లక్ష్యాన్ని చేరుకునేలా ఈ ఆర్‌డీని రూపొందించారు.
ఒక్కసారిగా పెద్ద మొత్తం పెట్టుబడి పెట్టకుండా రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ మొత్తం కూడబెట్టాలనుకుంటున్నారా? అలాంటి వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తీసుకొచ్చిన ‘హర్ ఘర్ లఖ్‌పతి’ స్కీమ్ ఉపయోగపడొచ్చు. ఇందులో ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని జమ చేస్తూ, కాలం పూర్తయ్యేసరికి రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని పొందొచ్చని సీఎన్‌బీసీటీవీ18 కథనం వివరించింది. ప్రజల్లో రెగ్యులర్‌గా పొదుపు చేసే అలవాటును పెంచేలా ఈ స్కీమ్‌ను రూపొందించారు. మైనర్లు, సీనియర్ సిటిజన్లు సహా దేశంలో నివసించే వ్యక్తులు ఈ స్కీమ్‌లో ఖాతా తెరవొచ్చు. ఈ స్కీమ్‌కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇవి.

