నిన్న రిలీజైన కొరియన్ కనకరాజు సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్లో రివ్యూలు రాలేవు కానీ.. డీసెంట్ టాక్ మాత్రం తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా కొన్నేళ్లుగా మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటున్న వరుణ్ తేజ్ సినిమాలు.. ఈ సారి మాత్రం డీసెంట్ టాక్తో బయట పడింది. కొంత మంది నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, మేజర్ ఆడియెన్స్ మాత్రం సినిమాను ఎంజాయ్ చేశారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్ తేజ్, రుతికా నాయక్, సత్యలు ప్రధాన పాత్రల్లో నటించారు.

